వీరుడికి వందనం - దేశం అభివందనం ..!
నిబద్ధతత కలిగిన సైనికుడు ఎలా వుంటాడు..శత్రు దేశానికి చిక్కినా ..రహాస్యాలు విప్పని యోధుడు ఎలా వుంటాడు..ప్రాణం పోయినా పర్వాలేదు..కానీ నా దేశం కోసం నేను తలవంచను అంటూ స్పష్టం చేసిన జవానును మనం చూడగలమా అంటూ సందిగ్ధంలో ఉన్న సమయంలో ..చుక్కానిలా ముందుకు వచ్చాడు తమిళనాడుకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్. జాతి యావత్తు ఆయనను విడుదల చేయాలని ముక్త కంఠంతో కోరింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా దౌత్యనీతిని ప్రదర్శించింది. ఇతర దేశాలను ఒప్పించడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, చైనా, జపాన్, అరబ్ కంట్రీస్ ను కూడగట్టింది. దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకిగా మిగిలింది. ఇప్పటికే భారత్ - పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
బాల్ కోట్ ప్రాంతంలో వాయు సేన దాడులు చేసిన నేపథ్యంలో జరిగిన సంఘటన థ్రిల్లర్ సినిమాను తలపింప చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ అనుకోకుండా పాక్ సైన్యం చేతికి చిక్కారు. అక్కడి జనం ఆయనపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపరిచారు. ఇంత జరిగినప్పటికీ ఈ యోధుడు కన్నీళ్లు పెట్టుకోలేదు. పూర్తి ధైర్య సాహసాలను ప్రదర్శించారు. తనను చంపినా సరే కానీ నాకు ప్రాణభిక్ష పెట్టిన దేశానికి ఎలాంటి అన్యాయం జరిగినా..నా ప్రజలకు ఎలాంటి కష్టం వాటిల్లినా నేను భరించలేనంటూ స్పష్టం చేశారు. ఏ సమయంలోను తాను సంయమనం కోల్పోలేదు. నలు వైపులా దారులు మూసుకు పోవడంతో పాకిస్తాన్ గత్యంతరం లేని పరిస్థితుల్లో అభినందన్‌ను విడిచి పెట్టారు. భారత ప్రభుత్వం దౌత్య పరంగా ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు పైగా కాంటాక్టు చేసింది.
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ..నిద్రహారాలు మాని వింగ్ కమాండర్‌ను విడుదల చేయాలని తీవ్రమైన వత్తిడి తీసుకు వచ్చారు. ముఖంపై గాయం చేసి..భుజాలు వెనక్కి కట్టి వేసి..చంపుతామని బెదిరించినా..దేశ రహస్యాలు చెబితే కావాల్సనవన్నీ ఏర్పాటు చేస్తామని పాకిస్తాన్ సైనిక దళం ఆఫర్ ఇచ్చినా అమ్ముడు పోలేదు. వైమానిక దళానికి చెందిన ఉన్నత స్థాయి అయిదుగురు ఐఏఎఫ్ అధికారుల బృందం అభినందన్ ను తీసుకు రావడంలో కృషి చేసింది. అంతర్జాతీయంగా యుద్ధానికి సంబంధించిన జెనీవా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయనను విడుదల చేస్తామని ప్రకటించారు. అంతకు ముందు అభినందన్‌ను తీసుకు వచ్చేందుకు కేంద్ర సర్కార్ ప్రత్యేకంగా విమానాన్ని పాక్‌కు పంపిస్తామని తెలిపింది. అందుకు ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదు. తాము రోడ్డు మార్గం ద్వారానే తీసుకు వచ్చి..భారత్‌కు అప్పగిస్తామని స్పష్టం చేశారు.
దేశానికి సంబంధించినంత వరకు అన్ని వర్గాలకు చెందిన వారు, జాతి యావత్తు ఒకే తాటిపైకి వచ్చారు. జయహో అంటూ ..వీరుడా వందనం అంటూ హృదయ పూర్వక స్వాగతం పలికారు. అధికారిక ప్రక్రియను రెడ్ క్రాస్ సొసైటీ చూసింది. వాఘా సరిహద్దులో ఇప్పటీకీ తీవ్ర మైన ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో అభినందన్ భారత భూభాగంలోకి అడుగు పెట్టారు. వారం రోజుల్లో అభినందన్‌ను విడుదల చేయాల్సిందేనంటూ మోడీ హెచ్చరికలు పంపించారు. అటు వైపు శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపుకుందామని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని పాక్ ఎదుర్కొంటోంది. ఉగ్రవాద స్థావరాలపై దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులను తరిమి వేయాలని , ఉగ్రవాదానికి ఊతమివ్వడం తక్షణమే నిలిపి వేయాలని అమెరికా, రష్యా హెచ్చరికలు జారీ చేసింది. మక్సూద్ అజహర్ తమ దేశంలోనే ఉన్నాడని ఆ దేశ విదేశాంగ మంత్రి ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు.
భారత రక్షణాత్మక దళాలతో పాటు ప్రభుత్వ రంగాలన్నీ వింగ్ కమాండర్‌కు ఘన స్వాగతం పలికాయి. శత్రు విమానాన్ని పడగొట్టి ..పాకిస్తాన్‌లో తొడగొట్టి సజీవంగా ఇండియాకు తిరిగి వచ్చిన ఈ యోధుడికి జాతి జేజేలు పలికిన తీరు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. 130 కోట్ల మంది ఉద్విగ్నతతో స్వాగతం చెప్పడం చరిత్రలో నిలిచి పోతుంది. అభినందన్ తల్లిదండ్రులకు అటు ఎయిర్ పోర్ట్‌లలోను..ఇటు ప్రతి ప్రాంతంలో లేచి నిల్చుని తమ గౌరవాన్ని చాటుకున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న వీరులకు..అమరులకు నివాళులర్పించడంతో పాటు భారత సైనికులకు వందనం తెలిపారు. ఇది జాతికి..దేశానికి శుభ పరిణామం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి