కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కబీర్ సింగ్ - సందీప్ రెడ్డి సక్సెస్ - అంతటా హిట్ టాక్
వంగా సందీప్ రెడ్డి గుర్తున్నాడా. ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినామాను షేక్ చేసిన డైరెక్టర్ అతను. విజయ్ దేవరకొండ అనే నటుడిని హిట్ రేంజ్ కు తీసుకు వెళ్లిన ఘనత అతడిదే. అతడితో తీసిన అర్జున్ రెడ్డి సినిమా ఊహించని రీతిలో కోట్లు కురిపించింది. ఇతర డైరెక్టర్లను, నిర్మాతలను ఆశ్చర్య పోయేలా చేసింది. ఈ మూవీ సృష్టించిన సునామీని టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ దిగ్గజాలు చూసి మనోడితో టచ్‌లోకి వచ్చారు. చివరకు బాలీవుడ్ కు వెళ్లాడు. అక్కడ అర్జున్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో కసితో కబీర్ సింగ్ మూవీ తీశాడు. అక్కడి వారికి మొదట్లో నచ్చక పోయినా ..సినిమా రిలీజ్ అయ్యాక..డాలర్ల పంట పండిస్తోంది. ప్రపంచ మంతటా ఇదే సినిమా గురించిన చర్చ. షాహిద్ కపూర్ ఇందులో హీరో. కబీర్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇండియాలో 3 వేల 123 థియేటర్లలో విడుదల కాగా, ఓవర్సీస్‌లో 493 థియేటర్లతో కలుపుకుని మొత్తం 3 వేల 616 స్క్రీన్లలో కబీర్ సింగ్ విడుదలైంది. రిలీజ్ అయిన ప్రతి చోటా హిట్ టాక్‌ను తెచ్చుకుంటోంది. లవ్ స్టోరీ బేస్ చేసుకుని తీసిన అర్జున్ రెడ్డి బంపర్ హిట్ గా తెచ్చుకుంది. ఓవర్ ఆల్‌గా బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. ఇప్పటి దాకా కల్ట్, బోల్డ్ ప్రేమ కథ రాలేదంటూ ప్రేక్షకులు కితాబిచ్చారు. ఈ మూవీలో లవ్‌లో విఫలమైన యువకుడిగా , డ్రగ్స్ కు బానిసైన డాక్టర్ గా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. అర్జున్ రెడ్డి సూపర్ హిట్ టాక్ తెచ్చు కోవడంతో ..డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి ఈ సినిమాను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు. షాహిద్ కపూర్ లాంటి టాలెంటెడ్ నటుడితో కబీర్ సింగ్‌గా రీమేక్ చేశాడు. షాహిద్‌కు జంటగా ఛార్మింగ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది..మెప్పించింది. రిలీజ్ అయిన ప్రతి చోటా హిట్ టాక్ తెచ్చుకుంటే..ఇదే మూవీపై అంతటా చర్చ జరుగుతోంది. ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పటి వరకు రాలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ నటన ఆయన కెరీర్‌లోనే ద బెస్ట్ అంటున్నారు. కియారా అద్వానీ తన అందచందాలతో కట్టి పడేసిందంటూ పొగుడుతున్నారు. కాకపోతే ఇంకాస్త నటనా పరంగా ఎదగాలని సూచిస్తున్నారు. మొత్తం మీద కబీర్ సింగ్ మూవీ ..బాలీవుడ్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తోంది. నటీనటుల నటన అద్భుతమని ప్రశంసించారు రమేష్ బాల. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ సందీప్ రెడ్డిదే అని ట్వీట్ చేశారు. ఇక ..బాలీవుడ్ ప్రముఖులు కబీర్‌సింగ్ ను చూసి ఔరా అంటున్నారు. షాహిద్ కపూర్ ను ..సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఇప్పటికే తెలుగులో అర్జున్ రెడ్డిని చూసిన వారు మాత్రం కబీర్ సింగ్ ను పెద్దగా ఇష్టపడటం లేదు. అస్సులు రీ మేక్‌లో ఏ మాత్రం కొత్తదనం లేదంటున్నారు. జాతీయ మీడియాకు చెందిన ఓ జర్నలిస్టు 1.5 రేటింగ్ ఇచ్చినా..ఈ సినిమా మాత్రం ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా దుమ్ము రేపుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి