దేవుడా..క్రికెట్ దిగ్గజాన్ని కరుణించు..!
క్రికెట్ ఆటకు కొత్త కళను జోడించి..వెస్టిండీస్ జట్టుకు కీలక ఆటగాడుగా వుంటూ..ఎనలేని విజయాలలో ప్రధాన పాత్ర పోషించి..రిటైర్ అయిన క్రికెట్ లెజండ్ ..దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా అస్వస్థతకు గురయ్యాడన్న వార్తను అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు. ముఖ్యంగా ఆ దేశానికి చెందిన ఫ్యాన్స్ ..ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారంతా దేవుడిని కోరుకుంటున్నారు..తమ దేవుడిని కరుణించమని. ఏ ఫార్మాట్‌లోనైనా ఆడగలిగే సత్తా కలిగిన ఆటగాళ్లలో లారా ఒకడు.
కూర్చుని అలవోకగా బౌండరీలు, సిక్సర్లను కొట్టగలిగే క్రికెటర్లలో బ్రియన్ నెంబర్ వన్‌గా నిలుస్తాడు. కళాత్మకంగా, అద్భుతంగా, మెస్మరైజ్ చేసేలా ..చూసే లోపే బంతి కనిపించకుండా స్టాండ్స్ లో పడేలా కొట్టగలిగే అరుదైన లెజెండ్స్ లలో మహ్మద్ అజారుద్దీన్ తర్వాత ..ఎవరి పేరునైనా సూచించాల్సి వస్తే..మొదటగా లారాకే ప్రయారిటీ ఇస్తామని క్రికెట్ పండితులు ఇటీవలే వెల్లడించారు.
కరేబియన్ ఆటగాళ్లు డిఫరెంట్‌గా ఉంటారు. యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే ..ఏ జట్టుతోనైనా ఎక్కడైనా ఢీకొనేందుకు రెడీగా వుంటారు. ఒకప్పుడు మార్షల్, రిచర్డ్స్, హోల్డింగ్, వాల్ష్, రిచర్డ్‌సన్ ..ఇలా ఎందరో ఆ టీంలో కీలక క్రికెటర్లుగా సేవలందించారు. తమ జట్టుకు చిరస్మరణీయమైన గెలుపులు అందించారు. ఆ తర్వాత కొంత కాలం స్తబ్దుగా ఉన్న ఈ జట్టులోకి సునామీలా వచ్చాడు బ్రయాన్ లారా. ఆటే ప్రాణంగా ఆడాడు. అద్భుతమైన డబుల్ సెంచరీ చేసిన సమయాల్లో ..కీలక భూమిక పోషించినప్పుడల్లా మైదానాన్ని ముద్దాడడం ఆయనకు మాత్రమే చెల్లింది. అంతలా ఆ ఆటతో కనెక్ట్ అయ్యాడు. కనుకే ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు.
లారా ఓ క్రికెటర్ మాత్రమే కాదు..ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎంతలా అంటే ..క్యాన్సర్ బాధితులు, అనాధ పిల్లలు, జీవితం పట్ల నిరాశతో ఉన్న వాళ్లకు ఆయన తోడుగా నిలిచారు. ఇవాళ విండీస్ దేశమంతటా లారా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆయన కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో ముంబయిలోని పరేల్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఓ హోటల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి ఆయన స్పెషల్ ఇన్వైటీగా పిలవడంతో..అక్కడికి అటెండ్ అయ్యారు. మధ్యలో నొప్పి రావడంతో దగ్గరలోని దవఖానాలో చేర్చారు.
గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో కామెంటరీ బాధ్యతలు చూస్తున్నారు. మొన్నటి దాకా ఐపీఎల్ కోసం పనిచేశారు. తాజాగా వరల్డ్ కప్ కోసం సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలియగానే స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుంది. ఆయన హెల్త్ గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం లారా ఆరోగ్యం నిలకడగానే ఉందని, 27న జరిగే విండీస్, ఇండియా మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ దిగ్గజ క్రికెటర్ త్వరగా కోలుకోవాలి. గుండె నిండా ప్రేమను నింపుకున్న ఈ ప్రేమ పాత్రుడిని దేవుడు కరుణించాలని వేడుకుందాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి