గుండెల్లో గువ్వల రాగం..మదిలో మోహన గీతం - ఆల్కాయాజ్ఞిక్ ప్రస్థానం..!
అప్పుడెప్పుడో శ్రీలంక రేడియో ఎప్పుడు ఆన్ అవుతుందా అని ఎదురు చూసే వాళ్లం. ఇప్పుడున్నంత టెక్నాలజీ వాడకం అప్పుడు లేదు. గత 10 ఏళ్ల నుంచి ఐటీ సెక్టార్ పుంజు కోవడం, ఇంటర్నెట్ ఆధారిత మాధ్యమాలతో పాటు సోషల్ , డిజిటల్ మీడియా రంగాలు దూకుడు పెంచడంతో ..ఎక్కువగా కష్టపడకుండానే కావాల్సిన పాటలన్నీ దొరుకుతున్నవి. దిగ్గజ సెర్చింగ్ కంపెనీగా పేరున్న గూగుల్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో ఇక వెనుదిరగాల్సిన పనిలేకుండా పోయింది. జస్ట్ క్లిక్ చేస్తే చాలు లక్షల్లో వీడియోలు, ఆడియోలు దర్శనమిస్తున్నాయి. కావాల్సిందల్లా ఓపికతో వినడమే లేదంటే రాసు కోవడమే. 1980 నుంచి 2000 దాకా ఇండియా వ్యాప్తంగా చూస్తే..బాలీవుడ్‌లో కొత్త గొంతుకలు విచ్చుకున్నాయి.
తమ గాత్రపు పరిమళాలను వెదజల్లాయి. లతా మంగేష్కర్, ఆషా భోంస్లే, కవితా కృష్ణ మూర్తి, అనురాధా పోడ్వాల్, సాధనా సర్గంతో పాటు ఆల్కా యాజ్ఙిక్ లు తమ ప్రతిభకు మెరుగులు దిద్దారు. మాధురీ దీక్షిత్ ఎంటర్ కావడం , ఆమెకు ఆల్కా పాటలు పాడడం ఇండియా అంతటా అవి పాపులర్ కావడం జరిగాయి. ఆమెతో పాటే కుమార్ షాను, ఉదిత్ నారాయణ్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జేషు దాస్, సురేష్ వాడ్కర్ లాంటి వాళ్లు పాడుతూనే ఉన్నారు. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ దూజే కేలియే సినిమా బంపర్ హిట్. అందులో లతాజీ, ఎస్పీబీ పాడిన పాటలు నేటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే వుంటాయి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, బప్పీలహరి, ఆనంద్ మిలింద్, నదీమ్ శ్రవణ్, అను మాలిక్ , తదితర సంగీత దర్శకులు కొత్త గాయనీ గాయకులతో పాడించారు. అయినా మెయిన్ లీడ్‌లో ఎస్పీబీ, ఉదిత్, కుమార్ షాను తమ హవాను కొనసాగించారు. పలు భాషల్లో కూడా వీరు పాడి మెప్పించారు.
ఆ 20 ఏళ్ల కాలంలో బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు హిట్ గా నిలిచాయి. కోట్లు కుమ్మరించేలా చేశాయి. దిల్, సాజన్, హమ్ ఆప్ కే హై కౌన్, దిల్ వాలే , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మూవీస్ బాక్సాఫిస్ బద్దలు కొట్టాయి. కొన్ని సినిమాలు కేవలం సాంగ్స్‌తోనే హిట్టయ్యాయంటే ఏ రేంజ్‌లో మ్యూజిక్ డైరెక్టర్స్ కష్టపడ్డారో చెప్పవచ్చు. ఓ వైపు కుమార్ షాను మేల్ సింగర్స్‌లో టాప్ వన్‌లో నిలిస్తే..ఫిమేల్ సింగర్స్‌లలో ఆల్కా యాజ్ఞిక్‌లు ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిద్దరు కలిసి వందలాది పాటలు పాడారు. ఎస్పీబీతో కలిసి ఆమె పాడిన సాజన్ మూవీ సాంగ్స్ ..టాప్ రేంజ్ లో ఉన్నాయి. సమీర్ కలంలోంచి జాలు వారిన పదాలు, ఆల్కా గొంతులోంచి అమృతాన్ని చిలికించాయి. అభిమానుల గుండెలకు స్వాంతన చేకూర్చాయి.
20 మార్చి 1966లో జన్మించిన ఆల్కా యాజ్ఞిక్‌కు ఇపుడు 53 ఏళ్లు. చెరగని అందం..చిరునవ్వుతో పాటు అద్భుతమైన గొంతు తోడవడంతో లెక్కలేనన్ని అవకాశాలు దక్కాయి. దానిని ఆమె సద్వినియోగం చేసుకున్నారు. 1980లో ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. మూడు దశాబ్ధాలుగా ఆల్కా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది కూడా ఓ రికార్డే. ఎన్నో అవార్డులు దక్కాయి. పురస్కారాలు లభించాయి. జాతీయ ఫిల్మ్ అవార్డులు పొందారు. 36 నామినేషన్స్‌కు ఆమె పేరు ఎంపికయ్యాయి. బిబిసి ప్రకటించిన 40 సౌండ్ ట్రాక్స్‌లో ఆల్కానే టాప్. నెంబర్ 1 గ్లోబల్ ఆర్టిస్ట్ ఇన్ సింగర్ అవార్డును యూట్యూబ్ ఎంపిక చేసింది. ఇది ఆమె సమర్థతకు దక్కిన గౌరవం.
లతా, ఆషా భోంస్లేల తర్వాతి స్థానం ఆమెదే. 1000 సినిమాలలో 20 వేల పాటలు పాడారు. బెంగాల్‌కు చెందిన ఆమెలోని మార్దవ్యాన్ని మొదటగా గుర్తించింది లక్ష్మికాంత్ మ్యూజిక్ డైరెక్టర్. తన సినిమాకు ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. ఆల్ ఇండియా రేడియోలో భజనలు పాడింది ఆరేళ్లప్పుడు. మొదటి సాంగ్ 1980లో పాడింది. పాయల్ కి ఝంకార్ , లావారీస్, మేరే అంగనే మే, హమారీ బహు ఆల్కా పాడినా..బ్రేక్ రాలేదు. ఒక్కసారిగా మాధురీ నటించిన తేజాబ్ సినిమా ఇండియాలో హయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో మాధురి కోసం పాడిన ఆల్కా పాట ప్రపంచాన్ని ఊపేసింది. ఏక్ దో తీన్ ..చార్ పాంచ్ కే సాత్ సాంగ్ హిట్ . ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. అవధి, బెంగాలీ, భోజ్‌పూరి, ఇంగ్లీష్, గుజరాతీ, మళయాళం, మరాఠి, ఒడియా, పంజాబీ, రాజస్థానీ, తమిళ్, తెలుగు భాషల్లో పాడారు.
1993లో ఆమె పాడిన ఇండియన్స్ ను ఊపేసింది. ఖల్ నాయక్ సినిమా కోసం ఆల్కా పాడిన ఛోళీ పీచే క్యా హై ..సాంగ్ సెన్సేషనల్ హిట్. ఈ పాటపై చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఆనంద్ భక్షి రాశారు ఈ పాటను. ఆల్కాతో పాటు ఇలా అరుణ్ పాడారు. వెరీ హస్కీ వాయిస్ లో దుమ్ము రేపింది ఆల్కా. జావెద్ ఆఖ్తర్ రాసిన పాటలకు ఆమె ప్రాణం పోశారు. హరిహరన్ తో కలిసి గజల్స్, భజన్స్ పాడారు. ఛమ్మా ఛమ్మా అంటూ పాడిన పాట ఊపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె వాయిస్ కు జనం ఫిదా అయ్యారు. బాలికలకు బాసటగా నిలవాలని కోరుతూ వారి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టింది.
రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వచ్చిన తాల్ సినిమాలో ఆమె పాడిన తాళ్ సే తాళ్ మిళా సాంగ్ గుండెల్ని పిండేసింది. ఐశ్వర్య నటన ఆల్కా పాట..ఓహ్ . మ్యూజిక్ దిగ్గజాలతో ఆల్కా పాడారు. కళ్యాణ్ జీ ఆనంద్ జీ, రాహుల్ దేవ్ బర్మన్, లక్ష్మికాంత్ ప్యారేలాల్, రాజేష్ రోషన్, నదీం శ్రవణ్, జతిన్ లలిత్, అను మాలిక్, ఏ.ఆర్.రెహమాన్, ఆనంద్ మిలింద్, హిమేష్ రేషమ్మియా, శంకర్ ఇషాన్ లాయ్, ఇస్మాయిల్ దర్బార్, ఆదేష్ శ్రీవాత్సవ, విజూ షా, ఎం.ఎం.కీరవాణి, సాజిద్ వాజిద్, బప్పీల హరి, నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, సందేశ్ శ్రీవాత్సవ, తదితరులతో పాడారు.
నదీమ్ శ్రవన్ కాంబినేషనల్ పాడిన పాటలు మోర్ హిట్‌గా నిలిచాయి. సాజన్, ఫూల్ అవుర్ కాంటే, దీవానా, దిల్ కా క్యా కుసూర్, హమ్ హై రాహీ ప్యార్ కే, రంగ్, దిల్వాలే, రాజా, ఆందోళన్, బర్సాత్, జీత్, రాజా హిందూస్తానీ, పర్దేశ్, సిర్ఫ్ తుమ్, ధడ్కన్, కసూర్, రాజ్, అందాజ్, దిల్ హై తుమ్హారా, బర్సాత్ సినిమాలకు ఆమె జీవం పోశారు. ఇక జతిన్ లలిత్ సంగీత దర్శకత్వంలో చూస్తే, ఖిలాడీ, రాజు బన్ గయా జెంటిల్మిన్, ఫరేబ్, గులాం, ఖామోషీ, ద మ్యూజికల్, సర్ఫరోష్, ఎస్ బాస్, కుచ్ కుచ్ హోతా హై, దిల్ క్యా కరే, కభీ ఖుషి కభి ఘమ్, ఫిర్ భి దిల్ హై హిందూస్తానీ, చల్తే ఛల్తే , హమ్ తుమ్ సినిమాలకు పాడారు.
అను మాలిక్ సినిమాల్లో..బాజీఘర్, ఫిర్ తేరి కహానీ యాద్ ఆయే, ఇమ్తింహాన్, రెఫ్యూజీ, విజయ్ పథ్, మై ఖిలాడీ తూ అనారీ, అఖేలే హమ్ అఖేలీ తుమ్, డూప్లికేట్, సోల్జర్, ఆర్జూ, హర్ దిల్ జో ప్యార్ కరేగా, అశోకా, యాదే, ఉమ్రావ్ జానూ, ఫిజా, జోష్, ఇష్క్ విష్క్, లాక్ కార్గిల్ ఉన్నాయి. ఇక అల్లా రఖా రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఆల్కా యాజ్ఞిక్ మనసు పెట్టి పాడారు. తాళ్, లగాన్, జుబేదా, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, స్వదేశ్, యువ, గురు, యువరాజ్, అదా ..ఏ వే ఆఫ్ లైఫ్, స్లమ్ డాగ్ మిలియనీర్, తమాషా మూవీస్‌లో పాడారు. రాజేష్ రోషన్ మ్యూజిక్ వహించిన సినిమాలు..కామ్ చోర్, కరన్ అర్జుణ్, దస్తక్, సబ్ సే బడా ఖిలాడీ, కోయిలా, పాపా కెహె థే హై, కహో నా ప్యార్ హై, కోయి..మిల్ గయా, ఆప్ ముజే అచ్చే లగ్నే లగే, క్రిష్ ఉన్నాయి.
బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన ఆనంద్ మిలింద్ సినిమాలకు ఆల్కా ముఖ్య భూమిక పోషించారు. తీస్రా కౌన్, ఖయామత్ సే ఖయామత్ తక్, లాడ్లా, గోపి కిషన్, అంజామ్, అనారీ, సుహాగ్, ఆజ్ కా గుండా రాజ్, కూలీ నెంబర్ 1, ఆర్మీ, లూట్‌రే, లోఫర్, మిష్టర్ బేచారా, జాన్, రక్షక్, అజయ్, హీరో నెంబర్ 1, సనమ్, మృత్యుదండ్, జూట్ భోలే కవా కాటే, ఛల్ మేరే భాయ్, జాన్వర్ సినిమాలు ఉన్నాయి. హిమేష్ రేషమ్మియా మ్యూజిక్ అందించిన ప్యార్ క్యా తో డర్నా క్యా, హెలో బ్రదర్, కహీ ప్యార్ నా హో జాయే, హమ్ రాజ్, చురా లియా హై తుమ్నే, తేరే నామ్, ఏతిరాజ్, క్యో కి, బనారస్, 36 చైనా టౌన్, మిలింగే మిలింగే సినిమాలకు పాడారు. లెక్కలేనన్ని పాటలు పాడిన ఆమెకు లెక్కించలేనన్ని అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు. ఆల్కా కు వయసు పెరిగిందేమో కానీ ..ఆ పాటల పాలపిట్ట మాత్రం ఇంకా పాడుతూనే ఉన్నది. గాత్రపు మాధుర్యాన్ని పంచుతూనే ఉన్నది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి