కూల్చివేత‌పై ఉత్కంఠ - హైకోర్టు స‌సేమిరా - అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కు పాదం

అనుకున్న‌దే జ‌రుగుతోంది. ఎంతైనా ప‌వ‌ర్ వున్న‌ప్పుడు ఆ రాజ‌స‌మే వేరు. ప్ర‌భుత్వ అధికారులు మారరు. కానీ స‌ర్కార్ మారింది. ఇంకేం గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల‌ను ఎత్తి చూప‌డ‌మే కాదు..కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి క‌ట్టిన భ‌వంతుల‌ను కూల్చి వేసేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ప్ర‌జా ధ‌నం నేల‌పాలై పోయింద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు. ఒక‌వేళ అలా జ‌రిగి వుంటే..త‌క్ష‌ణ‌మే ఆ నిర్మాణానికి ప‌ర్మిష‌న్ ఇచ్చిన అధికారుల‌తో పాటు కాంట్రాక్టు ద‌క్కించుకున్న కాంట్రాక్ట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాల్సింది. ఒక భ‌వ‌నం క‌ట్టాలంటే కొన్ని నెల‌లు ప‌డుతుంది. ఎంతో శ్ర‌మ‌. టైం కూడా వేస్ట్. ఇంత పెద్ద భవ‌నాన్ని ఏదో ఒక ప్ర‌భుత్వ శాఖ‌కో లేదా ఇత‌ర ప‌నుల కోసం వాడుకుని వుండి వుంటే బావుండేదన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏది ఏమైనా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య చంద్ర‌బాబు హ‌యాంలో క‌ట్టిన ఈ నిర్మాణం కూలి పోతోంది.

హైకోర్టులో పిటిష‌న్ వేసినా ..అక్ర‌మ నిర్మాణాన్ని తాము ఆప‌లేమంటూ ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఇంకేం కూల్చే ప‌ని చ‌కా చ‌కా జ‌రుగుతోంది. విదేశీ ప‌ర్య‌ట‌న ముగుంచుకుని ఏపీకి వ‌చ్చిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు గ‌ట్టి షాక్ త‌గిలింది. మున్మందు జ‌గ‌న్ ఇంకెంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది వేచి చూడాలి. ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జా వేదిక భ‌వ‌నాన్ని కూల్చి వేసే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌హ‌రీ గోడ‌ను కొంత మేర కూల్చి వేశారు. ప‌క్క‌నే ఉన్న ప్యాంట్రీ, డైనింగ్ హాల్, మ‌రుగుదొడ్ల‌ను తొల‌గించారు. ప్ర‌ధాన భ‌వ‌నం కూల్చి వేత ప‌నులు ప్రారంభించారు. ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద మెట్లు, ఎలివేష‌న్‌ను కూల్చేశారు. గ‌త ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మించినందున కూల్చి వేస్తామంటూ క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌ద‌స్సులో జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఆ మేర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. భ‌వ‌నంలో ఉన్న ఏసీలు, కంప్యూట‌ర్లు, కుర్చీలు, బ‌ల్ల‌లు, త‌దిత‌ర వ‌స్తువుల‌ను త‌ర‌లించారు. వీటిలో కొన్నింటిని హైకోర్టు స‌మీపంలో ఉన్న న‌ర్స‌రీకి, మ‌రికొన్నింటిని స‌చివాల‌యానికి పంపించారు.

అమ‌రావ‌తిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ల వ‌ద్ద‌కు కొంత ఫ‌ర్నీచ‌ర్ , కంప్యూట‌ర్ల‌ను చేర‌వేశారు. బాబు భ‌వ‌నం ప‌క్క‌నే ఈ భ‌వ‌నం ఉండ‌డం, ఆయ‌న రావ‌డంతో మ‌రింత ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.ఈ ఒక్క భ‌వ‌న‌మే కాకుండా , ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మూల‌నైనా..ఎక్క‌డైనా అక్ర‌మ క‌ట్ట‌డాలు నిర్మించిన‌ట్ల‌యితే త‌క్ష‌ణ‌మే వాటిని కూల్చే వేస్తామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ఏ ఒక్క‌రు అవినీతికి పాల్ప‌డినా స‌హించే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ఎంత‌టి వారైనా ..త‌న‌కు చెందిన వారైనా..ఎమ్మెల్యేలైనా స‌రే ఎవ్వ‌రినీ ఉపేక్షించ‌బోమమ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు త‌మ‌ను న‌మ్మి గెలిపించార‌ని, ఇలాంటి స‌మ‌యంలో ఎవ‌రైనా విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకోన‌ని అన్నారు. ప్ర‌జల‌కు చెందిన ప్ర‌తి పైసా వారికే చెందేలా , చేర‌వేయ‌డం ఉద్యోగుల బాధ్య‌త‌. దానిని విస్మ‌రిస్తే స‌హించ‌న‌న్నారు. ఎవ‌రైనా అక్ర‌మాల‌కు పాల్ప‌డితే త‌న‌కు నేరుగా ఫిర్యాదు చేయ‌వ‌చ్చంటూ ప్ర‌క‌టించారు. బాబు, జ‌గ‌న్ ల మ‌ధ్య యుద్ధం ఇక మొద‌లైన‌ట్టే. ఈ వార్ ఎంత దాకా వెళుతుంద‌నేది వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!