మజుందార్‌కు అంత‌ర్జాతీయ గౌర‌వం - ఎంఐటి బోర్డు మెంబ‌ర్‌గా నియామ‌కం

త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌కు కొద‌వే లేదని నిరూపిస్తున్నారు భార‌తీయులు. ఇప్ప‌టికే మ‌హిళ‌లు పురుషుల‌కు ధీటుగా త‌మ నాలెడ్జ్, అనుభ‌వం ఆధారంగా అత్యున్న‌త ప‌ద‌వులు అధిరోహిస్తున్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, లాజిస్టిక్, బిజినెస్, ఐర‌న్ అండ్ స్టీల్, గ్యాస్, ఆటోమొబైల్స్, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు, త‌దిత‌ర కంపెనీల‌కు ఛైర్మ‌న్‌లుగా, మేనేజింగ్ డైరెక్ట‌ర్లుగా, బోర్డు ఆఫ్ డైరెక్ట‌ర్లుగా విజ‌య‌వంతంగా బాధ్య‌త‌లు నిర్విస్తూ లాభాల బాట ప‌ట్టిస్తున్నారు. ఇటీవ‌ల పెప్సికోకు బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఇంద్రా నూయి ఏకంగా అమెరికా దిగ్గ‌జ కంపెనీగా పేరొందిన అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. తాజాగా బెంగ‌ళూరుకు చెందిన కిర‌ణ్ మ‌జుందార్ కు అంత‌ర్జాతీయంగా అత్యుత్త‌మ‌మైన గౌర‌వం ల‌భించింది.

ఇండియాలో ఆమెకు బ‌యోటెక్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా, ఆలోచ‌న క‌లిగిన నాయ‌కురాలిగా, ప్ర‌పంచాన్ని ప్రభావితం చేసిన మ‌హిళల్లో మ‌జుందార్ ఒక‌రిగా ఉన్నారు. అంతేకాకుండా అమెరికా - ఇండియా బిజినెస్ కౌన్సిల్ డైరెక్ట‌ర్‌గా కూడా ఎన్నిక‌య్యారు. ఎంఐటీ కార్పొరేష‌న్ కు ఫుల్ టైం స‌భ్యురాలిగా ఎంపిక‌య్యారు. మ‌స్సాచ‌సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ బోర్డ్ ఆఫ్ ట్ర‌స్టీస్ మ‌జుందార్ ఎన్నికైన విష‌యాన్ని వెల్ల‌డించింది. జూలై ఒక‌టి నుంచి ఆమె త‌న బాధ్య‌త‌లు ప్రారంభ‌మ‌వుతాయి. మొత్తం ఈ కార్పొరేష‌న్‌లో ఎనిమిది మంది స‌భ్యులుంటారు. వారిలో కిర‌ణ్ మ‌జుందార్ ఒక‌రు. ఒక్కో స‌భ్యురాలు ఐదేళ్ల‌పాటు సేవ‌లందిస్తారు. ఆమె స్థాపించిన బ‌యోకాన్ కంపెనీ ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ కంపెనీగా వెలుగొందుతోంది. ఆమెకు ఇపుడు 65 ఏళ్ల వ‌య‌సు. కానీ ఇప్ప‌టికీ 20 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డ‌తారు. కంపెనీకి స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేస్తారు. బ‌యోటెక్ సెక్టార్‌లో ఆమె మొద‌టి వ్య‌వ‌స్థాప‌కురాలిగా ఉన్నారు.

ఆమె స్థాపించిన బ‌యోకాన్ కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డిస్తోంది. ఆరోగ్య రంగంలో బ‌యోకాన్ ఒక బ్రాండ్ గా ఎదిగింది. ఎంఐటీలో బోర్డు మెంబ‌ర్ కావ‌డంతో నాపై మ‌రింత బాధ్య‌త పెరిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి రోజు ఏదో రూపంలో స‌వాళ్లు, స‌మ‌స్య‌లు వ‌స్తూనే వుంటాయి. వాటిని ప‌రిష్కరించ‌డం అనేది నా స‌మ‌ర్థ‌త‌కు ఓ ప‌రీక్ష లాంటిది. దీనిని నేను ఎలా అధిగ‌మిస్తాన‌ని ..చాలా మంది ఆతృత‌తో ఎదురు చూస్తున్నారని మ‌జుందార్ వ్యాఖ్యానించారు. ఇది కూడా నా లైఫ్‌లో ఓ ఛాలెంజ్ లాంటిది. ఫోర్బ్స్ మేగ‌జైన్ ప్ర‌క‌టించిన 100 మంది శ‌క్తివంత‌మైన మ‌హిళామ‌ణుల్లో ఆమె ఒక‌రు. ఆసియా-ఫ‌సిఫిక్ రీజియ‌న్‌లో అత్యంత శ‌క్తివంత‌మైన 25 మంది మ‌హిళ‌ల‌ల్లో కిర‌ణ్ మ‌జుందార్ టాప్‌లో ఉన్నారు. మెడిసిన్ మేక‌ర్ ప‌వ‌ర్ లిస్ట్ ప్ర‌క‌టించిన జాబితాలో ఆమెకు కూడా చోటు ద‌క్కింది. 2006లో రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ ఇంజ‌నీరింగ్ సైన్సెస్లో 2006లో ఫారిన్ మెంబ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. క్యాన్స‌ర్ బాధితుల‌కు సేవ‌లందించేందుకు గాను కిర‌ణ్ మ‌జుందార్ స్వ‌యంగా 1400 మెడిక‌ల్ సెంట‌ర్‌ను బెంగ‌ళూరులో ఏర్పాటు చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!