జాక్ పాట్ కొట్టేసిన క్యూర్ ఫిట్ - భారీ పెట్టుబడి
హెల్త్ కేర్ రంగంలో క్యూర్ ఫిట్ స్టార్టప్ సక్సెస్ బాట పట్టింది. భారీగా విస్తరించే దిశగా పరుగులు తీస్తోంది. ఈ అంకుర సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఉత్సుకత చూపిస్తున్నాయి. ఎక్విక్ కేపిటల్, యూనిలివర్ వెంఛర్స్, ఇన్నోవెన్ కేపిటల్, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. హెల్త్ అండ్ ఫిట్ నెస్ స్టార్టప్‌గా క్యూర్.ఫిట్ ప్రారంభమైంది చిన్న గదిలో. ఏకంగా ఈ కంపెనీల్నీ కలిపి 120 మిలియన్లను పెట్టుబడిగా పెట్టాయి. 2016లో ముఖేష్ బన్సాల్, అంకిత్ నాగోరి ఈ అంకురాన్ని ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ప్లాట్‌ఫాం ఆధారంగా ఇది పనిచేస్తోంది. క్యూర్ ఫిట్ ను 2 మిలియన్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆఫ్ లైన్‌లోనే కాకుండా ఆన్ లైన్‌లో కూడా సేవలు అందిస్తోంది ఈ స్టార్టప్.
రాబోయే 10 సంవత్సరాలలో 100 మిలియన్ల కస్టమర్లను టార్గెట్‌గా చేసుకుంది క్యూర్ ఫిట్. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, జైపూర్, దుబాయి ప్రాంతాలకు విస్తరించింది. అక్కడ వ్యాపారానికి ఢోకా లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు కస్టమర్లు పెరగడం, ఆదాయం గణనీయంగా సమకూరడం కూడా కంపెనీలు దీని వైపు చూసేలా చేశాయి. ఇప్పటికే 5, 00, 000 ల మంది యాక్టివ్ సబ్ స్క్రైబర్స్ గా వున్నారు. అన్ని ప్రాంతాల్లో 180 హెల్త్ అండ్ ఫిట్ నెస్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. వీటిని 800 సెంటర్స్‌కు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది క్యూర్ ఫిట్ యాజమాన్యం. వీటితో పాటు 35 మైండ్ ఫిట్ సెంటర్స్ కూడా 2020 వరకు ఏర్పాటు చేయాలన్నది టార్గెట్.
రోజు రోజుకు డిమాండ్ పెరగడం, బిజినెస్ విస్తరించడంతో చిరాటే వెంఛర్స్, ఆక్సెల్ పార్ట్‌నర్స్, కలారీ కేపిటల్, ఓక్ ట్రీ కేపిటల్ ఇప్పటికే క్యూర్ ఫిట్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇతర ప్రాంతాల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది ఈ కంపెనీ. ఇండియాతో పాటు దుబాయికి కూడా వీరి వ్యాపారం విస్తరించింది. అక్కడ క్యూర్ ఫిట్ కు భారీ ఆదరణ లభిస్తోంది. అంతర్జాతీయంగా మార్కెట్ వుందని మా సర్వేలో తేలింది. దీంతో ఆయా కంట్రీస్ లలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇపుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఫిట్ నెస్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని అందుకే భవిష్యత్ దీనికి ఉందని ఊహించే ఇన్వెస్ట్ చేస్తున్నామని చిరాటే వెంఛర్స్ ఛైర్మన్ సుధీర్ సేథి వెల్లడించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి