ఫార్చ్యూన్ గ్లోబల్ లిస్ట్ డిక్లేర్ - 7 ఇండియన్ కంపెనీలకు చోటు - నెంబర్ 1 వాల్‌మార్ట్
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా గణనీయంగా ఆదాయం కలిగిన కంపెనీల జాబితాను ప్రకటించే ఫార్చ్యూన్ గ్లోబల్ ఈ ఏడాది తన లిస్టును డిక్లేర్ చేసింది. ఈ జాబితాలో 7 భారతీయ కంపనీలకు చోటు దక్కింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్ ) తన ర్యాంకింగ్‌ను మరింత మెరుగు పర్చుకుంది. ఏకంగా 42 స్థానాలు దాటి 106వ స్థానం దక్కించుకుంది. గత కొంత కాలంగా ఇండియన్ కంపెనీలకంటే మెరుగైన ఫెసిలిటీస్, ప్రాఫిట్‌తో టాప్ రేంజ్‌లో ఉంటూ వచ్చిన భారత ప్రభుత్వ రంగం సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈసారి వెనక్కి వెళ్లడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేసింది. ఈసారి 117వ స్థానంలో నిలిచింది. దీనిని అధిగమించింది రిలయన్స్ కంపెనీ. ఫార్చ్యూన్ పత్రిక ప్రతి సంవత్సరం సర్వే చేపడుతుంది. ఆదాయంలో, విస్తరణలో డిఫరెంట్ వే తో వెళ్లే కంపెనీలను ప్రత్యేకంగా గుర్తిస్తుంది.
ఇందులో భాగంగానే తాజాగా రేటింగ్‌లను వెల్లడించింది. ఈ మ్యాగజైన్ జాబితాలో చోటు దక్కడం తమ పనితీరుకు దక్కిన గౌరవంగా..ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కు గుర్తుగా కంపెనీలు భావిస్తాయి. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీల పనితీరును బేరీజు వేస్తుంది ఈ పత్రిక. 2018 సంవత్సరంలో 6 వేల 230 కోట్ల డాలర్లుగా ఉన్న ఆర్ఐఎల్ ప్రాఫిట్ ..ఈ సంవత్సరానికి వచ్చే సరికల్లా కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగింది. దీని ఆదాయ శాతం 32.1 శాతం పెరిగింది. ఈసారి 8 వేల 230 కోట్లకు చేరుకుంది. ఇదిలా వుండగా గత ఏడాది ఐఓసీ ప్రాఫిట్ 6 వేల 590 కోట్ల డాలర్లు నమోదు కాగా..2019లో 17.7 శాతంతో 7 వేల 760 కోట్ల డాలర్లకే పరిమితమైంది. ఈ కంపెనీకి సంబంధించి ..2010లో 5 వేల 430 కోట్ల డాలర్లుగా ఉన్న ఆదాయం ఏటేటా 3.64 శాతం పెరుగుతూ వచ్చిందంటూ ఫార్చ్యూన్ వెల్లడించింది.
ఈ జాబితాలో ఆర్ఐఎల్‌కు చోటు దక్కడం ఇది 16వ సారి. 2012లో ఐఓసీ, ఆర్ఐఎల్ కంపెనీలు రెండూ టాప్ 100లో స్థానం దక్కించుకోగా, ఈ సారి వెనక్కి వెళ్లాయి. గత ఏడాది ఐఓసీకి 137 ర్యాంకు రాగా రిలయన్స్ 148 వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక టాప్ 500 జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని అమెరికాకు చెందిన వాల్ మార్ట్ కంపెనీ చేజిక్కించుకుంది. ఇఓసీ, ఆర్ ఐ ఎల్ కంపెనీలతో పాటు ఇండియాకు చెందిన ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, బీపీసీఎల్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. వాల్ మార్ట్ తర్వాత చైనా ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ సినోపెక్ గ్రూప్, రాయల్ డచ్ షెల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. నేషనల్ పెట్రోలియం, స్టేట్ గ్రిడ్, సౌదీ ఆరామ్కో, బీపీ, ఎక్సాన్ మొబిల్, ఫోక్స్ వ్యాగన్, టయోటా మోటారు మిగతా స్థానాలలో ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థ ఆపిల్ 11 వ స్థానం పొందింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి