అమరావతిపై రాద్ధాంతం ..బాధితులు ఆందోళకరం
చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాద్ధాంతం కొనసాగుతూనే ఉన్నది. ఎప్పుడైతే సందింటి జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారో, ఆనాటి నుంచి ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీకి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డి , మంత్రి బొత్స సత్యనారాయణలు ఇప్పటికే కేపిటల్ సిటీగా అమరావతి సరైనది కాదని, దాని స్థానంలో ఇంకో ప్రాంతాన్ని ఎంపిక చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక విజయసాయి రెడ్డి అయితే, ఏకంగా ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా కు తెలిసే జరుగుతోందంటూ కొత్త ట్విస్ట్ కు తెర లేపారు.
ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు, బాధితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కలిశారు. ఈ విషయంపై పవన్ అమరావతి విషయంలో బొత్స పై ఫైర్ అయ్యారు. దానిని మార్చవద్దంటూ కోరారు. అంతే కాకుండా బాధితులతో సమావేశ మయ్యారు. బొత్స ముందు వెనుకా అలోచించి మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు సైతం ఎట్టి పరిస్తతుల్లోనూ అమరావతినే కేపిటల్ సిటీగా ఉంచాలని, మార్పులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీజేపీ పార్ట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్ష్మి నారాయణ సైతం అమరావతిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అదే పార్టీకి చెందిన జాతీయ నేత జీవీఎల్ నరసింహ్మారావు సైతం అమరావతి ఇక కేపిటల్ సిటీగా ఉండబోదంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో పవన్ అమరావతిలో ఎంటర్ కావడంతో ఈ అంశం మరింత హీట్ పెంచింది. మరో వైపు బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు. చంద్ర బాబు హయాంలో అమరావతి ప్రాంతం దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశ మైంది. ఇదే సమయంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భారీగా కంపెనీలు క్యూ కట్టాయి. కొన్ని నిర్మాణాలు సైతం చేపట్టాయి. అనుకోని రీతిలో బాబు పవర్ లోకి రాక పోవడంతో ఇప్పుడు అమరావతి ఉంటుందో లేదోనన్న టెన్షన్ నెలకొంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి