ఇక చాలదా నీ జీవితానికి..!

మనకో వేదిక కావాలి
ఆలోచనలు కట్టిపెట్టి
అనుకున్న ప్రచారం కావాలంటే
మనకో గ్రూప్ ఉండాలి
అందుకు సరిపడినంత లౌక్యం కావాలి 
అప్పుడేగా కర్చు లేకుండా
అభిమానులు దొరికేది
అబ్బో యెంత ఫాలోయింగో
అనుకుంటూ మనం ఆక్షర్యానికి
గురవుతాం..అంతలోనే మనకెందుకు
అనుకుంటూ సాగిపోతాం ..!
ఎవరి దారులు వాళ్ళవి
ఎవరి లోకంలో వాళ్ళు
లోపట ఒకటి ..బయట మరొకటి
మెత్తగా పలకరించే ప్లాస్టిక్ నవ్వులు
అప్పుడప్పుడు కాసింత సేద దీర్చే మనుషులు
మరి మనను గుర్తించాలంటే
వాళ్ళను మెస్మరైస్ చేయాలంటే
మనకూ ఓ సమూహం కావాలి
అది మనతో పాటే సాగేలా
మన కనుసన్నలలో ఉండేలా
చూసుకోవాలి ...అప్పుడేగా
లైక్ లు ..అబ్బో అంటూ కామెంట్లు
ఇంకాస్తా ముందుకు వెళితే
అహో అంటూ కితాబులు ..!
నువ్వు కవి కాదల్చుకున్నవా
తక్కువ కాలంలో
గొప్పనైన వ్యక్తిగా అంతర్జాలంలో
నీ పేరు మారు మోగాలా
అయితే నీకు ఎలాంటి ప్రశ్నలు అక్కర్లేదు
నీ గురించి పతాక స్తాయిలో
గొప్పగా అభివ్యక్తీకరిస్తే చాలు
కాస్తంత లౌక్యం ఉంటె సరి
ఇంకెందుకు ఆలశ్యం
రండి ..పైసా ఖర్చు లేకుండా
మహా కవి కాదల్చుకున్నవా ..!
అయితే వెంటనే
ఓ వేదిక చూసుకో
నీకంటూ ఓ గ్రూప్ వెంటేసుకో
నిన్ను ప్రశించే వాళ్ళు
లేకుండా చూసుకో
ఇక..నీవొక బ్రాండ్ గా మారిపోతావు
మన పరివారం ఉంటుందిగా
పతాక శీర్షికలలో ..గొట్టపు డబ్బాలలో
నీకు చోటు దక్కుతుంది
ఇక చాలదా నీ జీవితానికి ..!!

కామెంట్‌లు