హ‌మ్ దోనో ..దో ప్రేమి ..దునియా చోడ్ చెలే - ఆరాధ‌న రాజేష్ ఖ‌న్నా..!

ఆ రోజులే వేరు..సినిమా అంటే తీర‌ని మోజు..ఇప్ప‌టిలా ఎప్పుడంటే అప్పుడు సినిమాలు చూసే వీలుండేది కాదు. ఓ వైపు పాఠాలు ఇంకో వైపు టాకీసుల ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌టం..చూసి ఎంజాయ్ చేయ‌డం. డ్రెస్సులు..స్ట‌యిల్..స్టేట‌స్ సింబ‌ల్ ..హిందీ అర్థ‌మ‌య్యేది కాదు..కానీ ఎవ‌రైనా మాట్లాడితే విన‌సొంపుగా వుండేది.. ఆ స‌మ‌యంలో హీరో క‌నిపిస్తే చాలు చ‌ప్ప‌ట్లు..ఈల‌లు..మా కాలంలో అమితాబ్ బ‌చ్చ‌న్, దేవానంద్, రాజేష్ ఖ‌న్నా ..సినిమాలంటే పిచ్చి ప్రేమ‌. కిషోర్ కుమార్, ల‌తా మంగేష్క‌ర్, ఆషా భోంస్లే ల పాట‌లు..ఎస్‌డీ, ఆర్ డి బ‌ర్మన్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పాట‌లంటే పంచ ప్రాణం. మ‌ధ్యాహ్నం అయ్యే స‌రిక‌ల్లా సిలోన్ రేడియోలో వ‌చ్చే వార్త‌లు, పాట‌ల కోసం నిరీక్ష‌ణ‌. ఓ వైపు గంట మోగేది..ఇంకో వైపు ..రాత్రి అయితే చాలు గీత్ మాలా ప్ర‌సారం అయ్యేది. ప్ర‌తి ఇంట్లో రేడియో..ఫిలిప్స్ కంపెనీ , మ‌ర్ఫీ కంపెనీలవి వుంటే అదో స్టేట‌స్.

ఆ రోజుల్లో రాజేష్ ఖ‌న్నా సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు ..అదో అద్వితీయ‌మైన ఆనందం. హ‌మ్ దోనో ..దో ప్రేమి..దునియా చోడ్ చెలే ..అనే పాట‌ను ఎన్ని సార్లు విన్నా త‌నివి తీర‌దు..ఆ స్ట‌యిల్..ఆ చూపులు..ఆ చైత‌న్య‌వంత‌మైన రూపం..ఓహ్..మాటల్లో వ‌ర్ణించ‌లేం..రాజేష్ ఖ‌న్నా అస‌లు పేరు జ‌తిన్ ఖ‌న్నా. 1942లో జ‌న్మించిన ఈ న‌టుడు ..ఎవ‌ర్ గ్రీన్ హీరోగా నిలిచి పోయాడు. తెలుగులో శోభ‌న్ బాబు ..హిందీలో రాజేష్ ఖ‌న్నా వీరిద్ద‌రిలో మ‌రిచి పోలేనిది ఒక‌టే ..చిరున‌వ్వు. న‌టుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ వేత్త‌గా రాణించారు. 163 సినిమాల‌కు పైగా న‌టించి హృద‌యాల మీద చెర‌గ‌ని సంత‌కం చేసి వెళ్లిపోయాడు ఇక సెల‌వంటూ రాజేష్ ఖ‌న్నా. 1970 నుండి న‌టించిన సినిమాల్లో 15కు పైగా మూవీస్ హిట్ గా నిలిచాయి. 1973లో డింపుల్ క‌పాడియాతో వివాహం జ‌రిగింది. 1984లో వీరిద్ద‌రు విడిపోయారు. పెద్ద కూతురు ట్వింకిల్ ఖ‌న్నా అక్ష‌య్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. చిన్న కూతురు రింకీ ఖ‌న్నా లండ‌న్‌కు చెందిన వ్యాపార‌వేత్త‌తో జ‌త క‌ట్టింది. 80వ ద‌శ‌కంలో టీనా మునింతో సంబంధం కొన‌సాగించారు. త‌ను లోకాన్ని వీడే ముందు రాసిన వీలునామాలో ఆస్తులు మొత్తం కూతుళ్లిద్ద‌రికీ పంచి..త‌న ధ‌ర్మాన్ని పాటించారు రాజేష్ ఖ‌న్నా.

1965లో యునైటెడ్ ప్రొడ్యూస‌ర్స్ ..ఫిలిమ్ ఫేర్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఆల్ ఇండియా టాలెంట్ కాంటెస్ట్‌లో పాల్గొన్న ప‌ది వేల అభ్య‌ర్థుల్లో చివ‌రి దాకా నిల‌బ‌డిన ఎనిమిది మందిలో రాజేష్ ఖ‌న్నా ఒక‌రు. అందులో ఆయ‌నే విజేత‌గా నిలిచారు. దీంతో ఆఖ‌రీ ఖత్, రాజ్ సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. 1967లో నిర్వ‌హించిన 40వ ఆస్కార్ అకాడమీ అవార్డుల‌లో ఉత్త‌మ ప‌ర భాషా చిత్రంగా ఆఖ‌రీ ఖ‌త్ కి ప్ర‌వేశ‌ర్హాత ల‌భించింది. ఔర‌త్, డోలీ, ఇత్తెఫాక్ త‌దిత‌ర చిత్రాలు ఆడాయి. వ‌హీదా రెహ‌మాన్ .అసిత్ సేన్ నిర్మించిన ఖామోషీలో క‌థానాయ‌కుడి పాత్ర‌కు రాజేష్ ఖ‌న్నాను ఆమె సిఫార‌సు చేసింది. ఆరాధ‌న సినిమా దేశాన్ని ఒక ఊపు ఊపింది..రికార్డుల‌ను తిర‌గ రాసింది. వ‌సూళ్ల‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. ల‌క్ష‌లాది మంది అభిమానులయ్యారు. భార‌త‌దేశ‌పు తొలి సూప‌ర్ స్టార్‌గా అవ‌త‌రించారు. త‌న న‌ట‌న‌తో మెప్పించారు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ష‌ర్మీలా ఠాగూర్, ఫ‌రీదా జ‌లాల్ స‌ర‌స‌న ద్విపాత్రాభిన‌యం చేశారు. ఇదే తెలుగులో క‌న్న‌వారి క‌ల‌లు పేరుతో సినిమాగా వ‌చ్చింది. ఇదే మూవీ కిషోర్ కుమార్ కు లైఫ్ ఇచ్చింది.

రాజేష్ ఖ‌న్నాకు ప‌ర్మినెంట్ గా నేప‌థ్య గాయ‌కుడిగా మారి పోయాడు. ఇద్ద‌రూ వేర్వేరు వ్య‌క్తులు అంటే న‌మ్మ‌లేనంత గా ఖ‌న్నా గొంతుకు కిషోర్ దా..గొంతు స‌రిపోవ‌డంతో వీరిద్ద‌రి పెయిర్ అలాగే సాగింది. 1991 వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్ న‌డించింది. హాథీ మేరే సాథి కూడా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. స‌లీంఖాన్, జావేద్ అఖ్త‌ర్ ల‌కు ఈ చిత్రం ద్వారా స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌లుగా పేరొందారు. న‌టి ముంతాజ్‌తో క‌లిసి ఎనిమిది సినిమాల్లో న‌టించారు రాజేష్ ఖ‌న్నా. వీరిద్ద‌రి సినిమాలు భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టాయి. ఆయ‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. ఎక్క‌డికైనా వెళితే అక్క‌డ ఆయ‌నే సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. సంగీత‌మే కీల‌కంగా ఉండేది ఆయ‌న సినిమాల్లో. బ‌ర్మ‌న్‌ల‌తో పాటు ల‌క్ష్మీకాంత్ ప్యారాలాల్ మ్యూజిక్ అందించారు. ఖ‌న్నా..కిషోర్..ఆర్డీ త్ర‌యం క‌టీ ప‌తంగ్, అమ‌ర్ ప్రేం, షెహ‌జాదా, అప్నా దేశ్‌, మేరే జీవ‌న్ సాథీ, ఆప్ కీ క‌సం, అజ్న‌బి, న‌మ‌క్ హ‌రామ్, మ‌హా చోర్, క‌ర్మ్, ఫిర్ వ‌హీ రాత్, ఆంచ‌ల్, కుద్ర‌త్, అశాంతి, అగ‌ర్ తుం న హోతే, ఆవాజ్, హ‌మ్ దోనో , అల‌గ్ అల‌గ్ వంటి అనేక చిత్రాలు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేశాయి. గురుద‌త్, మీనాకుమారి, గీతాబాలి త‌న అభిమాన న‌టులుగా ఓ సంద‌ర్భంలో పేర్కొన్నారు.

దిలీప్ కుమార్‌లోని దీక్షాదక్ష‌త‌, తీవ్ర‌త‌..రాజ్ క‌పూర్లోని చాతుర్యం, దేవానంద్ శైలి, ష‌మ్మీ క‌పూర్ శృతి త‌నకు ప్రేర‌ణ‌గా క‌లిగించాయ‌న్నారు. 1980వ ద‌శ‌కంలో రాజేష్ ఖ‌న్నా ..టీనా మునింల జంట ఫిఫ్టీ ఫిఫ్టీ, సురాగ్, సౌతెన్, ఆఖిర్ క్యూ, బేవ‌ఫాయి, ఇంసాఫ్ మై క‌రూంగా, అధికార్ సినిమాలు హైలెట్‌గా నిలిచాయి. త‌న త‌రం న‌టుల‌తో పోలిస్తే అంద‌రిక‌న్నా త‌క్కువ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌లో న‌టించారు. మక్సద్ 1984 నాటికి బాలీవుడ్ బాక్సాఫీసుకు 8.5 కోట్లను వసూలు చేసి రికార్డులలో రెండవ స్థానం దక్కించుకొన్నది. ఆర్ డీ బ‌ర్మ‌న్, కిషోర్ కుమార్, రాజేష్ ఖ‌న్నాల కాంబినేష‌న్ క‌డ‌దాకా సాగింది. ఆరాధ‌న‌..అజ్న‌బీ సినిమాలు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ క్లాసిక్స్ గా నిలిచే వుంటాయి. లోకం ఉన్నంత దాకా..సూర్య చంద్రులు విక‌సించే దాకా..ఆ ముగ్ధ మ‌నోహ‌ర రూపం.!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!