శాంసంగ్ వ‌ద్దు..ఆపిల్ ముద్దు

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా పేరొందిన వారెన్ బ‌ఫెట్ ఉన్న‌ట్టుండి విస్మ‌యానికి గురి చేశారు. ఎలా సంపాదించాలో, ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలో, ఎక్క‌డ త‌గ్గాలో, ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ పెట్టాలో నిత్యం సూచించే ఈ ఆర్థిక యోధుడు ఉన్న‌ట్టుండి వైరాగ్యానికి లోన‌య్యారు. ఈ మ‌ధ్య ఇంకెంత కాలం సంపాదించే దానిపై ఎందుకు కాన్‌సెంట్రేష‌న్ చేయాలంటూ ఒక సంద‌ర్భంలో చెప్పారు కూడా. ఇదే స‌మ‌యంలో అత్యంత ధనవంతుల జాబితాలో నెం. 1 స్థానంలో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం దాదాపు 88 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్‌ మూడో స్థానంలో ఉన్నారు. ఉన్న‌ట్టుండి బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌ ఓ అద్భుతం చేశాడు. ఆపిల్‌ పెట్టుబడిదారుడుగా ఉన్న ఆయన ఎట్టకేలకు స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యారు. అదీ శాంసంగ్‌కు బై చెప్పి, ఆపిల్‌ ఐ ఫోన్‌ను తీసేసుకున్నారు.
సుదీర్ఘ కాలం నుంచి ఆయన ఉపయోగిస్తున్న శాంసంగ్‌ హెవెన్‌ ఫ్లిప్‌ ఫోన్‌ను పక్కకు పడేసి తాజాగా ఐఫోన్‌ 11 తీసుకున్నారు. అయితే ఐఫోన్‌ 11లో ఏ రకం మోడల్‌ ఉపయోగిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఆపిల్‌ సంస్థలో 5.6 శాతం వాటాను బఫెట్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని విలువ 70 బిలియన్లు. ఇప్పటి వరకు ఫ్లిప్‌ ఫోన్‌ను ఉపయోగించిన బఫెట్‌ ప్రస్తుతం దానిని వాడటం లేదని స్మార్ట్‌ ఫోన్‌ను స్వీకరిస్తున్నానని వెల్లడించారు. నా ‘ఫ్లిప్‌ ఫోన్‌ శాశ్వతంగా పోయింది’ ఆయన అని పేర్కొన్నారు. ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ దీనిపై స్పందించారు. చాలా కాలం నుంచి బఫెట్‌కు కొత్త ఫోన్‌ కొనాలని సూచించానని.. ఇప్పుడు ఆయన ఐఫోన్‌ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా కొత్త ఐఫోన్‌ కొన్నా కేవలం ఫోన్‌ కాల్స్‌ చేయడానికి ఉపయోగిస్తానని, అందులోని ఆప్షన్ల జోలికి వెళ్లనని వారెన్‌ బఫెట్‌ తెలిపారు. బఫెట్‌ వద్ద ప్రస్తుతం ఐపాడ్‌ కూడా ఉంది. దానిని పరిశోధన కొరకు, స్టాక్‌ మార్కెట్‌ ధరలను చూసుకోడానికి వాడుతానని ఆయన పేర్కొన్నారు.
మొత్తం మీద వారెన్ బ‌ఫెట్ ఫోన్‌ను మార్చారు..స‌రే రేపు ఏం చేయ‌బోతున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉంది. తాను సంపాదించిన వాటిని ఎవ‌రికి దార‌ద‌త్తం చేస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వారెన్ చాలా కాలం నుంచి వివిధ కంపెనీల్లో కొత్త‌గా పెట్టుబ‌డులు పెడుతూ వ‌స్తున్నారు. అయితే ఆయ‌న దేనినీ పూర్తిగా న‌మ్మ‌రు. ఆయా కంపెనీల‌కు సంబంధించి ఏమాత్ర‌మైనా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చినా వాటిని పాటించరు. స్వంతంగా ఆయ‌నే అన్నింటిని ద‌గ్గ‌రుండి ప‌రిశీలిస్తారు. మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా తాను నిర్ణ‌యం తీసుకుంటారు. దీని వ‌ల్ల ఎక్కువ‌గా న‌ష్ట‌పోవ‌డం అంటూ జ‌ర‌గ‌దు. దీని వ‌ల్ల కంపెనీల‌ను న‌మ్ముకుని ఉన్న కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులకు న‌ష్టం వాటిల్ల‌దు. దీంతో వారెన్ బ‌ఫెట్ పై ప్ర‌పంచ వ్యాప్తంగా అపార న‌మ్మ‌కం పెట్టుకున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!