మురిసిన పెద్ద‌న్న‌..మెరిసిన చిన్న‌న్న

న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అపూర్వ‌మైన రీతిలో స్వాగ‌తం ల‌భించింది. ఇండియాకు వ‌చ్చిన ఈ పెద్ద‌న్న‌ను ఇండియ‌న్ ప్రైమ్ మినిస్ట‌ర్ న‌రేంద్ర దామోద‌ర‌దాస్ మోదీ ఆహ్వానం ప‌లికారు. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ న‌గ‌రం ఇపుడు ప్ర‌పంచం త‌న వైపున‌కు చూసుకునేలా చేసుకుంది. విమానాశ్ర‌యంతో పాటు మ‌హాత్మాగాంధీ శ‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మం కూడా వార్త‌ల్లోకి ఎక్కింది. ల‌క్ష‌లాది మంది మోదీకి, ట్రంప్ కు అడుగ‌డుగునా జ‌య‌జ‌య ధ్వానాల‌తో స్వాగ‌తం ప‌లికారు. ట్రంప్ త‌న‌కు ఆత్మీయ మిత్రుడంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు ట్రంప్‌ను మోదీజి. ఇదే స‌మ‌యంలో ట్రంప్ దంప‌తుల‌తో పాటు కూతురు , అల్లుడు కూడా ఇండియా స‌ర్కార్ ఆతిథ్యానికి ఫిదా అయి పోయారు. వేలాది మంది సెక్యూరిటీలో కీల‌క పాత్ర పోషించారు. అడుగ‌డుగునా మోదీ..ట్రంప్ జ‌యహో అంటూ చ‌ప్ప‌ట్ల‌తో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
ఈ స్వాగ‌త స‌త్కార్యాల‌ను చూసి అమెరికా ప్రెసిడెంట్ ప‌రివారం పూర్తిగా సంతోషానికి లోన‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీజీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ట్రంప్. అమెరికాకు అత్యంత న‌మ్మ‌క‌మైన‌, ఆత్మీయ‌మైన దేశం ఒక్క ఇండియానేన‌ని స్ప‌ష్టం చేశారు యుఎస్ ప్రెసిడెంట్. వ్యాపార‌, వాణిజ్య, త‌దిత‌ర రంగాల‌లో భార‌త్‌తో తాము స్నేహాన్ని స్వాగ‌తిస్తున్నామంటూ స్ప‌ష్టం చేశారు. ఎట్ట‌కేలకు ట్రంప్ మాట‌ల‌తో మోదీజి తెగ ఖుషీ అయి పోయారు. అహ్మ‌దాబాద్ స్టేడియం మొత్తం జ‌నంతో హోరెత్తి పోయింది. ట్రంప్ టీం మొత్తం మోదీ ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చుకుంది. అంతే కాదు ఒక చాయ్ వాలా నుంచి ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన ప్ర‌జాస్వామ్య దేశానికి ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి భారీ మెజారిటీతో ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన , తెచ్చిన ఘ‌న‌త ఒక్క మోదీకే ద‌క్కుతుంద‌న్నారు అమెరికా ప్రెసిడెంట్.
జాతిపిత, ఫాద‌ర్ ఆఫ్ నేష‌న్ మ‌హాత్మాగాంధీ స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మంలో చాలా సేపు గ‌డిపారు ట్రంప్ ప‌రివారం. అంతే కాకుండా గాంధీ వాడిన చ‌రఖాను వాడి చూశారు. ఆయ‌న‌కు ఆశ్ర‌మంలో ఏమేం చేస్తున్నారో మోదీజీ ద‌గ్గ‌రుండి విడ‌మ‌రిచి చెప్పారు. అక్క‌డి నుంచి నేరుగా భారీ భ‌ద్ర‌త న‌డుమ అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో నూత‌నంగా నిర్మించిన భారీ క్రికెట్ స్టేడియంను ప్రారంభించారు ఇరువురు. ఇదే స‌మ‌యంలో ల‌క్ష‌లాది మంది జ‌నం రోడ్డుకు ఇరు వైపులా స్వాగ‌తం ప‌లికారు. క్రీడా ప్రాంగ‌ణ‌మంతా క‌లియ తిరుగుతూ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. మొద‌ట‌గా మోదీజీ భావోద్వేగంతో మాట్లాడారు. త‌మ‌కు అత్యంత ఆత్మీయ‌మైన వ్య‌క్తి ట్రంప్ అని నొక్కి వ‌క్కాణించారు. న‌మ‌స్తే ట్రంప్ అంటూ జ‌నంతో చెప్పించారు. దీంతో మోదీని భావోద్వేగంతో ప‌ట్ట‌లేక ఆలింగ‌నం చేసుకున్నారు ట్రంప్. ట్రంప్ కూడా పూర్తి సంతోషంతో ప్ర‌జ‌ల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు.
ఇండియాకు అమెరికా బాస‌ట‌గా ఉంటుంద‌న్నారు. ఆర్థిక‌, వ్యాపార‌, వాణిజ్య‌, ర‌క్ష‌ణ రంగాల‌లో ఒప్పందాలు చేసుకుంటామ‌న్నారు. బాలీవుడ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అంతే కాకుండా అనుకోని రీతిలో భార‌త క్రికెట్ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్, విరాట్ కోహ్లిల పేర్లు రావ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య చ‌కితుల‌ను చేసింది. అక్క‌డి నుంచి ఆగ్రాలోని అద్భుత సౌంద‌ర్య క‌ట్ట‌డం తాజ్ మ‌హ‌ల్ ను సంద‌ర్శించారు ట్రంప్ ప‌రివారం. చాలా సేపు అక్క‌డే వుండి దాని అందాల‌ను ఆస్వాదించారు. కెమెరాలో బంధించారు. నిజ‌మైన ప్రేమికుల్లా ఫోటోలు దిగారు. ఇదో ఉద్విగ్న‌భ‌రిత‌మైన స‌న్నివేశంగా పేర్కొంటూ ట్వీట్ చేశారు అమెరికా ప్రెసిడెంట్. మొత్తం మీద పెద్ద‌న్న ఇండియా టూర్ ఆద్యంత‌మూ అద్భుత‌మైన అనుభూతుల‌ను మిగిల్చింది మోదీజీ, ట్రంప్‌ల‌కు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!