కార్ల అమ్మకాలు స్లో..సెకండ్స్ కే హై ప్రయారిటీ
రాను రాను కార్ల అమ్మకాలు తగ్గి పోతున్నాయి. అభిరుచుల్లో మార్పు రావడం ..ధరలు ఎక్కువగా ఉండడంతో వీటిపై అంతగా దృష్టి సారించడం లేదు. ఇండియాలో దేశ, విదేశీ కంపనీలకు చెందిన కార్లు షికార్లు చేస్తున్నాయి. నగరంలోని రోడ్ల మీద..జాతీయ రహదారులపై ..ఎక్కడ చూసినా కార్లే కార్లు. డిఫరెంట్ మోడల్స్, ఎక్కువ ఫెసిలిటీస్‌తో పాటు పూర్తి భద్రత ఉండే వాహనాలకు సై అంటున్నారు. ధరలు ఆకాశానికి అంటడంతో సామాన్య , మధ్యతరగతి జనం వీటి పై పెద్దగా ఆసక్తిని కనబర్చడం లేదు. కార్లు స్టేటస్ సింబల్‌గా మారడంతో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ వెహికిల్ ఉండాలని పరితపించారు.
మారుతీ సుజుకీ, హ్యూందాయి, టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, మహీంద్ర, వోక్స్ వ్యాగన్, తదితర బ్రాండ్స్ కలిగిన కార్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇపుడు సీన్ మారింది. జీవన ప్రమాణాలు పెరగక పోవడం, జీతాలు పెరిగినా వాటి వైపు చూడక పోవడంతో అమ్మకాలపై ప్రభావం చూపించాయి. ఉద్యోగస్తులు, మధ్యతరగతి కుటుంబాల వారంతా ప్లాట్లు, బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మోదీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దుతో బతకడం గగనంగా మారింది. బ్యాంకుల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఉన్న డబ్బులన్నీ మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయి. గేదెను మెయింటెనెన్స్ చేయడం ఎలాగో ..కార్లను కొనుగోలు చేస్తే వచ్చేది ఏమీ ఉండక పోగా..రోజూ దాని కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సి రావడంతో జనం లబోదిబోమంటున్నారు.
మరో వైపు డీజిల్, పెట్రోల్ ధరలు ఎండ వేడిమి కంటే ఎక్కువగా వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. మోదీ ప్రభుత్వ హయాంలో ఆయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్పా తగ్గించిన పాపాన పోలేదు. కార్లను కొనేటప్పుడు ఉన్నంత ఆనందం దానిని వాడుతున్న కొద్దీ జేబులు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆయా ఫ్యామిలీస్ ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు అద్దె కార్లను వినియోగిస్తున్నారు. ఎలాగూ ఊబర్, ఓలా కంపెనీలు ఉండనే ఉన్నాయి. అలా బుక్ చేసుకోవడం..ఇలా ప్రయాణించడం మరింత సులువు కావడంతో వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ పనులను సకాలంలో చేసుకుంటూ తమ ఇళ్లకు వెళ్లి పోతున్నారు.
మరీ కార్లు అవసరం అనుకుంటే..సెకండ్స్‌లో దొరికే వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ట్రూ వాల్యూ, క్వికర్, డాక్టర్స్ కార్స్ ఇలా చాలా సంస్థలు మంచి వాహనాలను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటికి సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నారు కష్టమర్స్. ఈ ఏడాది ప్రారంభంలో కార్లకు డిమాండ్ పెరిగినా ..తాజా పరిస్థితిని బట్టి చూస్తే ..అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో కార్ల కంపెనీలు బిగ్ ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వారే ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి.
ఎలాంటి వడ్డీ కట్టకుండానే కారును ఇంటికి తీసుకెళ్లవచ్చంటూ బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. అయినా జనం ముందుకు రావడం లేదు. దాని వైపు చూడటం లేదు. యువతీ యువకులు మాత్రం లగ్జరీ కార్ల వైపు చూస్తున్నారు. వాటినే కొనేందుకు ఎగబడుతున్నారు. కొత్త కారు కొనుగోలు చేయాలంటే ..5 లక్షలు పెడితే కానీ రావడం లేదు. ఆపై కోటి రూపాయల దాకా కార్లు ఉన్నాయి. కానీ వాటితో జర్నీ సంతోషంగా ఉన్నా ..బాదుడు మాత్రం స్పీడ్‌లో ఉండడంతో ఎందుకొచ్చిన ఖర్మ అనుకుంటూ ఎంచక్కా బస్సులు, అద్దె వాహనాలు, రైళ్లు, ఫ్లయిట్లలో వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఎన్నికల ప్రభావం, కొనుగోలు శక్తి నశించడం, నోట్ల రద్దు కార్ల అమ్మకాలకు బ్రేక్‌లు వేశాయి. రెండోసారి పవర్లోకి వచ్చిన పీఎం మోదీ ఎలాంటి భరోసా ఇస్తారో వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి