25 కోట్లుంటే..బఫెట్ తో భోజనం - బిగ్గెస్ట్ ఆఫర్ ..!
ఎవరి పిచ్చి వారికి ఆనందం. వారెన్ బఫెట్..ఈ పేరు ప్రపంచాన్ని నిరంతరం విస్మయ పరుస్తూనే వుంటుంది. వరల్డ్ మార్కెట్‌ను ఈ బిజినెస్ దిగ్గజం ప్రభావితం చేసినంతగా ఇంకెవ్వరూ ఇప్పటి దాకా చేయలేదంటే నమ్మగలమా. ఇది ముమ్మాటికీ నిజం. ఈ లోకంలోనే అత్యంత సుసంపన్నమైన, ధనవంతుడు ఎవరంటే ఠక్కున సమాధానం వచ్చే పేరు బఫెట్. ఆయన లెక్కలేనంత ఆస్తులను పోగు చేసుకున్నాడు. తరాలకు సరిపడా డాలర్లు సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆయనకు చెందిన ఆస్తులే కొలువై వున్నాయి. నోట్ల కట్టలు, భవంతులు, స్థలాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్స్, లెక్కలేనన్ని కంపెనీలు, వ్యాపారాలు, ఆయిల్, మైన్స్, బంగారం, వెండి, వజ్రాలు, లాజిస్టిక్, మొబైల్స్, ఆటోమొబైల్స్ ఇలా సమాజంలోని ప్రతి రంగంలో వారెన్ బఫెట్ పెట్టుబడి పెట్టుకుంటూ పోయారు.
స్టాక్ మార్కెట్లో ఆయనదే హవా. ఇంతగా పాపులర్ అయిన ఈ వ్యాపార దిగ్గజంతో ఒక్కసారైనా కలవాలని అనుకోవడం వింత కోరికగా అనిపిస్తుంది కదూ. ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తూ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న బఫెట్ తో కేవలం భోజనం చేయాలని కలలు కంటున్నారా. అయితే మీ దగ్గర జస్ట్ 24 కోట్ల రూపాయలు వుంటే చాలు..ఎంచక్కా ఆయనతో కలిసి లంచ్ చేయవచ్చు. ఈ అరుదైన అవకాశం ప్రపంచంలోని ప్రజలందరికీ బఫెట్ కల్పించారు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరూ ట్రై చేసి చూడండి. ఈ అద్భుత మైన వ్యక్తితో కరచాలనంతో పాటు కాసింత భోజనం కలిసి చేసే భాగ్యాన్ని పొందండి.
ఇందుకు కావాల్సిందల్లా ఏమిటంటే..ఇండియాలో ఎక్కడికి వెళ్లినా లంచ్ వెయ్యో లేదా 2 వేలకంటే మించదు. బిలియనీర్ , బెర్క్ షైర్ హాత్ వే ఇంక్ ఛైర్మన్ వారెన్ బఫెట్ తో భోజనం చేసేందుకు ఈబే సంస్థ ఓ ప్లాన్ చేసింది. బఫెట్ తో లంచ్ చేసేందుకు ప్రతి ఏటా ఛారిటీ ఆక్షన్ నిర్వహిస్తారు. ఈసారి కూడా ఆక్షన్ ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో తాజాగా పిలిచిన వేలం పాటలో ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు పలికింది. ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసే వారు ఎవరైనా వుంటే ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. బఫెట్ తో భోజనం చేసేందుకు 25 వేల డాలర్లతో ఆన్‌లైన్‌లో వేలం పాటను ఈబే కంపెనీ ప్రారంభించింది. గుర్తు తెలియని బిడ్డర్లు రికార్డు స్థాయిలో 34 లక్షల 56 వేల 789 డాలర్లకు బిడ్ వేశారు.
ఈ బిడ్ ద్వారా వచ్చిన మనీని శాన్ ఫ్రాన్సిస్కో ఛారిటీ గ్లైడ్ ఫౌండేషన్ కు ఇవ్వనున్నారు. ఈ సంస్థ పేదలు, స్వంత ఇల్లు లేని వారిని ఆదుకుంటుంది. మొదటగా 2000 సంవత్సరంలో ఆక్షన్ నిర్వహించారు. 29.6 మిలియన్ డాలర్లు పోగయ్యాయి. ఇండియన్ రూపీస్ అయితే దాదాపు 206 కోట్లు. గ్లైట్ ఫౌండేషన్ కోసం బఫెట్ సేకరించారు. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు గుర్తుగా ఈ ఫౌండేషన్ ను స్వంతంగా వారెన్ ఏర్పాటు చేశారు. 2010, 2011 సంవత్సరాల్లో జరిగిన బిడ్‌లో విన్నర్ గా నిలిచిన టెడ్ వెస్కర్ 5.25 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి బఫెట్ తో కలిసి భోజనం చేశారు. ఈసారి ఎంతకు పలుకుతుందనేది..ఎవరు గెలుస్తారనేది ప్రశ్నగా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి