భారత్‌లో పాపులర్ అంకురాలు ఇవే
ఇండియాలో స్టార్టప్‌లు సక్సెస్ బాట పడుతున్నాయి. ప్రారంభం నుండే డిఫరెంట్ ఐడియాస్ బేస్ చేసుకుని కంపెనీలుగా ఎదుగుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్లకు, అంకురాలకు శ్రీకారం చుట్టాలని ప్రయత్నించే వాళ్లకు ఇప్పటికే ఆ రంగంలో సక్సెస్ అయిన వాటిని చూస్తే మీరెలా మార్కెట్‌లో నిలదొక్కుకోవచ్చో తెలుస్తుంది. స్వయాన అవగతమవుతుంది. 2018-2019 సంవత్సరానికి గాను 53 స్టార్టప్‌లు టాప్ పొజిషన్‌లో నిలిచాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 2008లో ప్రారంభమైన మోమో స్టార్టప్ లో 470 మిలియన్ల పెట్టుబడి పొందింది. ఢిల్లీ, చెన్నై, కొచ్చి, తదితర ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసింది మోమో. ఈ స్టార్టప్ టాప్ వన్ గా నిలిచింది. ఓలా క్యాబ్స్ రెండో స్థానంలో నిలిచింది.
దీనిని కర్ణాటకలోని కోరమంగలలో ఏర్పాటు చేశారు. 3.8 మిలియన్ల ఫండింగ్ పొందింది. దీనిని 2010లో ఏర్పాటు చేశారు. బెంగళూరు కేంద్రంగా 2010లో అడ్రస్ హెల్త్ పేరుతో స్టార్టప్ ప్రారంభమైంది. హెల్త్ పరంగా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు పొందవచ్చు దీని ద్వారా. 1.5 మిలియన్ల ఫండింగ్ పొందింది ఈ స్టార్టప్. ఇండియా వ్యాప్తంగా తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయ్యింది ఏది అంటే జొమాటో స్టార్టప్. దీనిని హర్యానాలోని గూర్గావ్‌లో 2008లో ఏర్పాటు చేశారు. ఏకంగా 755.6 మిలియన్ల పెట్టుబడులు పెట్టారు. 2010లో ఉత్తర్ ప్రదేశ్‌లో పే టిఎం స్టార్ట్ అయింది. 2.2 బిలియన్ల ఫండింగ్ సమకూరింది. బెంగళూరు కేంద్రంగా ఫ్రెష్ టు హోం పేరుతో స్టార్టప్ సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది.
24.3 మిలియన్ల నిధులు పెట్టారు ఇందులో. ఇదే ప్రాంతం నుండి మరో స్టార్టప్ స్టార్ట్ అయింది. 2014లో ఫ్రెష్ మెనూను ప్రారంభించారు. దీనిలో 24.2 మిలియన్ల నిధులు వచ్చి చేరాయి. ముంబయి కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ ఫ్లై రోబ్ విజయవంతంగా నడుస్తోంది. ఇందులో 10.7 మిలియన్లు పెట్టుబడిగా వచ్చాయి. గురుగ్రాంలో ఏర్పాటైన మైరా కూడా పాపులర్ అయింది. ఇందులో 7 మిలియన్లు ఫండింగ్ కింద సమకూరాయి. బెంగళూరు కేంద్రంగా 2016లో ప్రారంభమైన క్యూర్ ఫిట్ స్టార్టప్ లో ఏకంగా 174.6 మిలియన్ల నిధులు వచ్చాయి. మరో స్టార్టప్ డన్జో సక్సెస్ బాట పట్టింది.
ఇది బెంగళూరు కేంద్రంగా స్టార్టై ఢిల్లీ, గూర్గావ్, పూణే, చెన్నై, హైదరాబాద్ నగరాలకు విస్తరించింది. ఇందులో 29.6 మిలియన్ల పెట్టుబడి పెట్టారు ఔత్సాహికులు. షట్ల్ గూర్గావ్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ లో ఏకంగా 48.8 మిలియన్లు పెట్టుబడిగా వచ్చాయి. బెంగళూరు కేంద్రంగా 2016లో స్టార్ట్ అయిన డిజిట్ ఇన్సూరెన్స్ బీమా రంగంలో మరో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమ లేకుండా నడుస్తోంది ఈ సంస్థ. ఇందులో 45 మిలియన్లు నిధులుగా వచ్చాయి. ముంబయి కేంద్రంగా 2016లో ప్రారంభమైన కూల్ బెర్జ్ సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది.
క్లియర్ దేఖో పేరుతో 2016లో ఘజియాబాద్‌లో అంకురం ప్రారంభమైంది. ఇందులో 20 మిలియన్లు నిధులుగా వచ్చాయి. ద మినిమా లిస్ట్ స్టార్టప్ 2015లో ముంబయిలో ప్రారంభమైంది. రేజర్ పే స్టార్టప్ బెంగళూరు కేంద్రంగా 2013లో స్టార్ట్ అయింది. ఇందులో ఏకంగా 31.7 మిలియన్లు పెట్టుబడిగా పెట్టారు. నైన్ లీప్స్ అంకుర సంస్థ 2014లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైంది. ఇందులో 4 మిలియన్ల నిధులు వచ్చాయి. 2015లో ఢిల్లీ కేంద్రంగా ఇన్నోవ్ కో వర్కింగ్ పేరుతో ప్రారంభించిన స్టార్టప్ సక్సెస్ బాట పట్టింది. ఇందులో 4 మిలియన్ల పెట్టుబడి పెట్టారు. దీంతో పాటు మరికొన్ని స్టార్టప్‌లు విజయపు బాటలో పయనిస్తున్నాయి.
షాబంగ్, ఆకో జనరల్ ఇన్సూరెన్స్, చెకవుట్, ఇన్ క్రెడ్, జమ్ బోటెయిల్, డాక్ టాక్, స్మాల్ కేస్, వేదాంతు, ఇన్‌స్టావన్స్, ఓవర్ కార్ట్, ఫ్లాక్, డాక్టర్ ఇన్‌స్టా, కో వర్స్, ఒన్ ఎంజీ స్టార్టప్‌లలో నిధులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. మరో వైపు కార్స్ 24 స్టార్టప్, డెయిలీ హంట్, ఇబ్యూటర్, మీషో, మిల్క్ బాస్కెట్, ఫార్మ్ ఈజీ, పాలసీ బజార్, రేవ్, షేర్ చాట్, నైకా, టాపర్, ట్రావెల్ ఒన్ ట్రయాంగిల్, అర్బన్ లాడర్, అయిసల్, అండ్ మి, బాంబే షేవింగ్ కంపెనీ, పాప్ క్సో, జెస్ట్ మనీ, ఎక్స్ ప్రెస్ బీస్ స్టార్టప్స్ పై ఫారిన్ కంట్రీస్ కు చెందిన వ్యాపారవేత్తలు ఇన్వెస్ట్ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. మొత్తం మీద అంకురాలు అద్భుత విజయాలు స్వంతం చేసుకుంటున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి