కేటాయింపులు కోట్లల్లో ..మంజూరు వేలల్లో - తీరు మారని బ్యాంకర్లు
రైతులంటేనే బ్యాంకర్లకు చులకన. ఎందుకంటే ఎలాంటి లాభదాయకమైన వృత్తి కాదు. నైపుణ్యం కలిగిన వారు, ఉద్యోగులు, స్వచ్ఛంధంగా సంపాదించే వారికి, వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు, సంస్థలకు అప్పనంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇది గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. బ్యాంకర్లు అనుసరిస్తున్న విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా..ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటోంది వీరి పనితీరు. ప్రతి ఏటా ఆయా బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళికలను తయారు చేయడం, వాటిని వెల్లడి చేయడం తీరా చూస్తే రైతుల నోట్లో మట్టి కొట్టడం షరా మామూలుగా మారింది.
తెలంగాణ సర్కార్ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. ఆ దిశగా వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు పెద్ద పీట వేసింది. రైతు బంధు పథకంను ప్రవేశ పెట్టింది. రైతులకు వెన్నుదన్నుగా ఉండేలా తయారు చేసిన ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలయ్యేలా స్ఫూర్తిగా నిలిచింది. ఈ స్కీంను ఇతర దేశాలు సైతం ప్రశంసించాయి. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన కమల సర్కార్ రైతులకు జై కొట్టింది. ప్రతి ఏటా ప్రతి రైతుకు ఎలాంటి నిబంధనలు విధించకుండానే ..ఎన్ని ఎకరాలున్నా ..నేరుగా 6 వేల రూపాయలను జమ చేయాలని నిర్ణయించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ..ఇటు కేంద్ర సర్కార్ రైతుల జపం చేస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు అన్నదాతలకు అండగా నిలిచేందుకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
ఇందు కోసం ప్రత్యేకంగా వార్షిక వ్యవసాయ రుణ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తోంది. లక్షా 46 వేల 238 కోట్ల రూపాయలతో తెలంగాణలోని బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళికను తయారు చేసింది. 2019-20 వార్షిక సంవత్సరానికి రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ విడుదల చేసింది. ఎస్ఎల్‌బీసీ వ్యవసాయ రంగం, పరిశ్రమలు, అన్ని రకాల సర్వీస్ సెక్టార్‌కు సంబంధించిన లోన్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో 60 శాతం ప్రాధాన్యత రంగాలకు కేటాయించగా 40 శాతం ఇతర వాటికి కేటాయించింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం సుందరం శంకర్, ఎస్ ఎల్ బీసీ ప్రెసిడెంట్ జె.స్వామినాథన్ పాల్గొన్నారు.
వ్యవసాయ రంగానికి 68 వేల 596 కోట్లు కేటాయించింది. పంట రుణాలకు 55, 04, 502 కోట్లు, అగ్రికల్చర్ టర్మ్ లోన్లు 3, 56, 501 కోట్లు, అనుబంధ రంగాలకు 2, 27, 281 కోట్లు, రైతులకు నేరుగా లబ్ధి చేకూరేలా జమ చేసే రూపాయలు మొత్తం 60 లక్షల 83 వేల 284 కోట్లు కేటాయించింది. అగ్రి మౌలిక వసతుల కోసం 42 వేల 416 కోట్లు, అగ్రి - సహకార రంగానికి 77 వేల 905 కోట్లు, ఇతర అగ్రికల్చర్ లోన్లు ఒక కోటి 20 లక్షల 321 కోట్లు, వ్యవసాయ రంగానికి 62 లక్షల 08 వేల 605 కోట్లు కేటాయించారు. సూక్ష్మ వ్యాపార సంస్థల కోసం లక్షా 63 వేల 732 కోట్లు, మధ్య తరహా వ్యాపార సంస్థలకు 88 వేల 348 కోట్లు, అన్ని వ్యాపార సంస్థలకు 7 కోట్ల 17 లక్షల 222 కోట్లు, విద్యా రంగ రుణాలు 70 వేల 589 కోట్లు, హౌసింగ్ రుణాలు 92 వేల 019 కోట్లు, పునరుత్పాదక శక్తి రంగానికి 20 వేల కోట్లు, సామాజిక మౌళిక వసతుల కోసం 21 వేల 499 కోట్లు, ఇతర రంగాలకు కోటి 20 లక్షల కోట్లు కేటాయించింది. బ్యాంకర్ల బడ్జెట్ కోట్లున్నా ..కేటాయింపులు మాత్రం వేలల్లో ఉండడం బాధాకరం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి