!..పసిడి పండుతోంది..వెండి వెలుగుతోంది..!
ఇక అందనంటూ బంగారం ధర పైపైకే వెళుతోంది. రికార్డ్ స్థాయిలో ధరలు పెరుగుతూనే ఉన్నా జనం మాత్రం కొనడం ఆపడం లేదు. హైదరాబాద్ నగరంలోని జ్యుయలరీ షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా 40 వేల రూపాయలకు చేరుకుంది. మరో వైపు వెండి కూడా సరి లేరు నాకెవ్వరూ అంటోంది. 46 వేలకు చేరుకుంది. దీంతో షేర్ మార్కెట్ రివ్వుమంటూ దూసుకెళుతోంది. ఓ వైపు పసిడి పెరుగుతుంటే , భారతీయ రూపాయి మాత్రం మరింత తగ్గింది. దేశీయ మార్కెట్ లో గోల్డ్ ప్రైజ్ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నది. దేశమంతటా పసిడి ధర అందకుండా వెళుతున్నా, మహిళలు, యువతులు మాత్రం పోటీ పది కొంటున్నారు. రోజు రోజుకు దాని ధర ఇక ఆగలేనంటోంది.
వరల్డ్ మార్కెట్ లో ట్రెండ్ పడిపోకుండా ఉండటం, రూపీ బలహీన పడటంతో పసిడి ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. తాజాగా 20 నుంచి ధర తగ్గక పోగా, పెరుగుతూనే వెళుతోంది. కిలో వెండి సైతం 14 వందలు పెరిగింది. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ల తయారీదారుల నుండి డిమాండ్ పెరగడం కూడా ధరల్లో వ్యత్యాసం అగుపిస్తోంది. ఢిల్లీ, ముంబయి మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్ లో పసిడి రానంటోంది. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతూనే ఉన్నది. దీంతో అంతా పసిడి భద్రంగా ఉంటుందని దానినే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైజెస్ బలంగా ఉండటం , దేశీయంగా రూపాయి బలహీన పడటం వల్ల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నాయి.
ట్రెండ్ ఇలాగే కొనసాగుతూ ఉంటే గనుక బంగారం ధర ఏకంగా 45 వేలకు చేరుకున్నా సందేహ పడాల్సిన పనిలేదు. ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటి దాకా 20 శాతానికి పైగా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పసిడితో పోటీ పడుతున్నాయి. త్వరలోనే కిలో వెండి 48 వేల రూపాయలకు చేరుకోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక వేల ధర తగ్గితే మహా అయితే వేయి రూపాయలు తగ్గవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి నాలుగు నెలల కాలంలో వీటి ఆస్తులు అమాంతం పెరిగాయి. ఏకంగా 5 వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం. మొత్తం మీద పసిడి పంట పండుతోంది..వెండి వెలుగుతోంది అనుకోవడం తప్ప మరో మార్గం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి