కొనేటోల్లకు కొనుక్కున్నంత

ఒకప్పుడు ఏదైనా కొనాలంటే కిరాణా కొట్టుకు పోయే వాళ్ళు. లేదా వేరే దగ్గర్లో ఉన్న మండలానికో లేదా పట్టణానికో , సంతల్లోకి వెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు లోకం మారి పోయింది. దునియా అంతా చిన్నదై పోయింది. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఉన్న చోటనే కావాల్సినవన్నీ ఇంటి ముందు వాలి పోతున్నాయి. కావాల్సిందల్లా కొనగలిగే సామర్థ్యం ..చేతినిండా డబ్బులుంటే చాలు. దేనినైనా కొనుగోలు చేసే వీలు ఉన్నది. ఓ వైపు మార్కెట్ రంగం కుదేలవుతున్నది. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం కారణంగా జనం కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు.

దీంతో రిటైల్ వ్యాపారస్తులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. వినియోగదారులు ,కొనుగోలుదారులు ఎక్కువగా వినోద రంగానికి చెందిన వస్తువులనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం ఆశించినంతగా ఇండియన్ మార్కెట్ అంతగా ఊపు అందుకోలేదు. దీంతో విత్త మంత్రి దిద్దు బాటు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ప్రజలు నిత్యం వాడే వస్తువులపై అధికంగా పన్నులు విధించడం తో కొనుగోళ్లు నిలిచి పోయాయి. సబ్బులు, డైపర్లు, న్యాప్కిన్లు, తదితర ప్రోడక్ట్స్ ధరలపై విధించిన జీఎస్టీని తగ్గిస్తోంది. దీంతో కొనుగోళ్లు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటన్నిటిని తక్కువ ధరల్లో , మరింత నాణ్యవంతంగా ఉండేలా చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా హాస్పిటల్ హ్యాండ్ గ్లోవ్స్, ఆపరేషన్ థియేటర్ గంబూట్స్ , ఫ్లోర్స్ ను శుభ్రం చేసే లిక్విడ్స్ ను కూడా ఈ జాబితాలోకి చేర్చాలని అనుకుంటోంది. ఆరోగ్య సంరక్షణకు అత్యంత ముఖ్యమైన మందులు, వైద్య పరికరాలు , ఇంజెక్షన్లు వంటి డిస్పోజబుల్స్ , హెల్త్ , హైజీన్ ప్రాడక్ట్స్ ను గుర్తించేందుకు ఎన్ ఎల్ ఈ ఎం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కొన్ని షబ్ కమిటీలను కూడా నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే అత్యవసర మందులు, హైజీన్ ప్రాడక్ట్స్ జాబితా సిద్ధం చేసి ఉంచింది. ఇటీవల ఆరోగ్య శాఖ మీద పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రతిదీ ప్రజలకు సంబంధించింది కావడంతో మరింత పారదర్శకంగా ఉండేలా చూస్తోంది. ప్రజా ఆరోగ్యం ప్రాథమిక హక్కు. దాని పట్ల నిర్లక్ష్యం వహించడం మరింత ప్రమాదం. రోజు వారీగా వాడే వస్తువుల జాబితాలో ఇవి కూడా చేరి పోయాయి. మొత్తం మీద ఇప్పుడు ఆఫ్ లైన్ లోనే కాదు ఆన్ లైన్ లో లభిస్తున్నాయి.

కామెంట్‌లు