ఉద్యోగాలు బారెడు..భర్తీ మూరెడు..వయసై పోతున్నా స్పందించని సర్కార్
బలిదానాలు, పోరాటాలు, ఆత్మహత్యలు చేసుకుని.. లాఠీ దెబ్బలు తిని , జైలు పాలై , కేసులు నమోదై ..కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాడ లేకుండా పోయింది. స్వతంత్ర భారతంలో ఇంతటి దారుణమైన, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కున్న సందర్భాలు లేనే లేవు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలోనైనా కొన్ని ఉద్యోగాలు పొందారు. కానీ స్వరాష్ట్రంలో అభ్యర్థులు, నిరుద్యోగులు లక్షలాది మంది కొలువుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అలుపెరుగని పోరాటం చేసింది.
అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన వెంటనే కొలువులు భర్తీ చేస్తారని అంతా ఆశించారు. కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేకుండా పోయింది. అయితే బంగారు తెలంగాణా లేకుంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. ఐటి అంటూ జపం చేస్తోంది. ఇప్పటికే రెండు లక్షలకు పైగా వివిధ శాఖలలో ఖాళీలు ఉన్నవి. వాటిని నింపకుండా తాత్సారం చేస్తూ వస్తోంది. ఇక సమాజాన్ని ప్రభావితం చేసే యూనివర్సిటీల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఈరోజు వరకు పూర్తి స్థాయిలో వీసీలు లేరు, తగినంత టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది లేరు. ఇదేమని అడిగితే కేసులు..ఆపై ఆరోపణలు. ఇక ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా పోయింది. ఇదేమిటని అడిగే నాథుడే లేకుండా పోయాడు.
టీఎస్ సర్కార్ ఏర్పడి ఆరేళ్ళు అవుతున్నా ఈరోజు వరకు పూర్తి స్థాయిలో ఆయా కార్యాలయాలు పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఓ వైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, అభ్యర్థులు నానా తిప్పలు పడుతుంటే , ఇంకో వైపు పని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగులు జీతాలు తీసుకుంటూనే చేతినిండా సంపాదిస్తున్నారు. పాలన గాడి తప్పింది. ఇక ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు ప్రజల గోడు వినడమే లేదు. రెవెన్యూ శాఖ పై లెక్కలేనన్ని ఆరోపణలు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్ళింది. విద్య శాఖ ఉందో తెలియని పరిస్థితి. ఇంటర్ బోర్డు సెక్రెటరీ నిర్వాకానికి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కేజీటూపీజీ మాటేమో కానీ కనీస సౌకర్యాలు లేక పిల్లలు లబోదిబో మంటున్నారు.
కేజీబీవీ బడుల్లో సీఆర్టీ పోస్టుల కోసం పరీక్ష రాసి పాసైన వారికి 11 నెలలు గడుస్తున్నా నేటి వరకు ఆర్డర్స్ ఇవ్వడం లేదు. సర్వ శిక్ష అభియాన్ కింద ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలా ఉండగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ వైపు మిగతా శాఖలు ఇంకో వైపు ఉన్నాయి. ఎవరి నిబంధనలు వారివే . కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ తీసి వేస్తామని చెప్పిన సర్కార్ వాటినే అమలు చేస్తోంది. విద్యా వాలంటీర్లకు ఆరు నెలలు గడిచినా నేటి దాకా శాలరీలు లేవు. ఇదిలా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయిన అభ్యర్థులు ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఏర్పాటు అయ్యాక కొలువులు భర్తీ కాక పోవడంతో వారి వయసు దాటి పోతోంది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి ఖాలీలు భర్తీ చేస్తే ఆత్మహత్యలను నివారించి వారవుతారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి