ఆర్‌ఐఎల్ అదుర్స్ ..మార్కెట్ జోష్..!
డబ్బులు ఊరికే రావు..ఇది ఇటీవల తెలుగు వాకిళ్ళల్లో ..బుల్లి తెరను వీక్షించే వారందరికీ తెలిసే ఉంటుంది. ఒక సేల్స్ మెన్ గా జీవితాన్ని ప్రారంభించి, వేలాది మందికి జీవనోపాధిని అందిస్తున్న ఓ సాధారణ వ్యక్తి సాధించిన అపురూప విజయానికి కొండ గుర్తు. కొలువులు లేవని భాధ పడుతూ కూర్చోవడం కంటే కాలాన్ని ఒడిసి పట్టుకుని ముందుకు దూసుకు వెళితే ఎన్నో గెలుపులు స్వంతమవుతాయి. వందలాది మంది విజేతలంతా మన కళ్ళ ముందే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా స్మార్ట్ ఫోన్లలో గడిపే వాళ్లకు వీరి జీవితాలు కనువిప్పు కావాలి . చదువు కోవడం అంటే పుస్తకాలనో లేదా నోట్స్ నో ఆ పూటకు చదివి పాసవుతే అది గొప్ప సక్సెస్ అనుకుంటే పొరపాటు పడినట్లే .
గెలుపు అంటే ఇతరులకంటే భిన్నంగా ఆలోచించడం. ఎవరూ వెళ్లని దారులలో ప్రయాణించడం. పొద్దస్తమానం అమెరికా జపం చేసే ప్రబుద్దులకు దేశీయంగా ఉంటూనే అసాధారణమైన విజయాలు అందుకున్న వారిని చూసి నేర్చుకోవాలి. ఈ దేశం కోసం రేయింబవళ్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న సైనికుల ముందు మన జీవితాలు ఏపాటివి. నిన్నటి దాకా అప్పుల్లో కూరుకు పోయిందని రిలయన్స్ మీద అపనమ్మకం పెంచుకుంటూ వచ్చిన మార్కెట్ ను ఒకే ఒక్క ప్రకటనతో భారతీయ మార్కెట్ ప్రపంచాన్ని షేక్ చేశారు ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ.
మార్కెట్ మందగమనంలో ఉన్నప్పటికీ 10 శాతం షేర్ వాల్యూతో దూసుకెళ్లింది . అదీ నమ్మకం అంటే ..అదీ దెబ్బ కొట్టడం అంటే. ఏకంగా రిలయన్స్ కేవలం ఒక్క రోజులోనే రూ.72,000 కోట్లు మార్కెట్ విలువను సాధించింది . దీంతో మార్కెట్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది . ఇంకో వైపు సెన్సెక్స్ 624 పాయింట్లు వద్ద కుప్ప కూలితే .. ఆర్‌ఐఎల్ మాత్రం అంచనాలకు మించి దూసుకెళ్లింది . మదుపరులకు భారీగా రిలీఫ్ లభించింది. తాజాగా ముంబై లో జరిగిన సమావేశంలో ముఖేష్, 18 నెలల్లో రుణ రహిత సంస్థగా మారతామని, భవిష్యత్‌లో అధిక డివిడెండ్లు ఇస్తామని ప్రకటించారు . మొత్తం మీద డబ్బులు ఊరికే రావు .. డిఫరెంట్ గా ప్లాన్ చేస్తే వస్తాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి