పాటగాడిపై ఏఐసిఏ నిషేధం ..?

ఇండియన్ పాప్ స్టార్.. మోస్ట్ పేవరబుల్ సింగర్ గా పేరొందిన మీకా సింగ్ పై వేటు పడింది . భారత ..పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో మీకా ఆ పాక్ లో పర్యటించడం, ప్రదర్శన ఇవ్వడంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా మీకా సింగ్ పై నిషేధం విధించింది. తాజాగా కరాచీ నగరంలో పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ పర్వేశ్ ముష్రాఫ్ సమీప బంధువు కోసం మీకాసింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మీకా తన పాటలతో అలరించారు . జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో దాయాది దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో సమస్యలు నెలకొన్నాయి . ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి .వాస్తవాధీన రేఖ వెంట సైనికులను మోహరించాయి.

ఈ సమయంలో ..దేశం అంతటా స్వతంత్ర దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్న వేళ మీకా సింగ్ ఎందుకిలా చేశారని అభిమానులు వాపోతున్నారు. మీకా సింగ్ ఎక్కడికి వెళ్లినా సరే వేలాది మంది అభిమానులు చుట్టుముడుతారు. మోస్ట్ పాపులర్ సింగర్ గా ఇప్పటికీ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నారు. అంటే అతడికున్న ఫాలోయింగ్ అలాంటిది. ఇండియాలోని పలు భాషల్లో పాప్ సాంగ్స్ కాకుండా సినిమాకు కూడా మీకా పాడారు. అవి కూడా పాపులర్ అయ్యాయి . మరికొన్ని వైరల్ గా మారాయి. పంజాబ్ లో టాప్ సింగర్ గా పేరొందిన దలేర్ మెహందీ కి స్వయానా తమ్ముడు మీకా సింగ్. బోలో తరరా అంటూ ఇండియన్స్ ను ఊపేస్తే ..మరో వైపు మీకా తన గాత్రంతో దుమ్ము రేపాడు .

పలు దేశాల్లో లెక్క లేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. కోట్లాది మంది అతడికి ఫ్యాన్స్ ఉన్నారంటే విస్తు పోవడం మనవంతు అవుతుంది. సింగర్ గా ఎంతో పేరు సంపాదించిన ఈ పాటగాడు ఏది చేసినా సంచలనమే. గాయకుడిగా ఎన్నో హృదయాలను కొల్లగొట్టిన ప్పటికీ , ప్రవర్తన విషయంలో కొన్ని వివాదాలను మూటగట్టుకున్నారు. తాజాగా పాక్ లో పర్యటించడం , ప్రదర్శన ఇవ్వడంపై మరో వివాదంలో చిక్కుకున్నారు మీకా. దీంతో ఆయన ఇండియాలో ఎలాంటి ప్రదర్శనలు ఇవ్వరాదంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోషియేషన్ హుకూం జారీ చేసింది . మీకాసింగ్ తో కలిసి భారతదేశంలో ఎవరూ పని చేయరాదని, అలా చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది . మొత్తం మీద పాటగాడికి ప్రమాదం వచ్చి పడింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!