విమెన్స్ టీ20 టీమ్ ఇదే

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టును ఇండియన్ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన భారత జట్టుకు ఆల్ రౌండర్ హర్మన్‌ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూర్కీ బ్యాట్స్‌ విమెన్ రిచా ఘోష్‌కు జట్టులో చోటు దక్కింది. వచ్చే నెల 21న సిడ్నీలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య మ్యాచ్‌తో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. గ్రూప్‌-ఎలో భారత జట్టుతోపాటు ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.

గ్రూప్-బిలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు కూడా హేమలత కళా సారథ్యంలోని మహిళా సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఈ పోరు జరగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 31న కాన్‌బెర్రాలో ఇండియా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 12న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇలా ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు సారధిగా ఉండగా స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. కాగా మిథాలీ రాజ్ లేక పోవడం ఓ వెలితిగా అగుపిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!