ప్రియాంకపై పీకే ప్రశంస

భారతీయ రాజకీయ వ్యూహకర్త, జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య స్వరం మారుతోంది. తన గొంతును సవరించుకుంటున్నారు. బీజేపీతో మైత్రీ బంధాన్ని కొనసాగిస్తోంది జేడీయూ. ఇదే సమయంలో నితీష్ కుమార్ మోడీతో చెలిమి చేస్తుండగా విచిత్రంగా అదే పార్టీకి చెందిన ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. దీంతో ఇరు పాటీలు మధ్య మరింత దూరం పెరుగుతోంది. మరో వైపు ప్రశాంత్ కిషోర్ తాజాగా రాహుల్ గాంధీపై, ప్రియాంకా గాంధీపై ప్రసంశలు కురిపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన హస్తం పార్టీ నేతలను పొగడ్తతల్లో ముంచెత్తారు. ఈ ఆందోళనకు సారథ్యం వహించిన ఆ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజల పక్షాన నిలిచిన తీరు అభినందనీయమని అభిప్రాయ పడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు. కాగా బిహార్‌లో సైతం ఎన్‌ఆర్‌సీని అమలు చేయవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌పై ప్రశాంత్‌ కిషోర్‌ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై ఆయన నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యక్త పరిచారు. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, నిరసనలు చోటుచేసు కోవడంతో నితీష్‌ తలొంచక తప్పలేదు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేసే ప్రసక్తే లేదని చివరికి తేల్చి చెప్పారు. మొత్తం మీద ఈ రాజకీయ వ్యూహకర్త ఏది చేసినా అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు పీకే దేశమంతా ఓ సెన్సేషనల్. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తెగ సంబరపడి పోతోంది. పైకీ లాంటి వ్యక్తి తమకు సపోర్ట్ చేయడాన్ని పాజిటివ్ గా తీసుకుంటోంది. 

కామెంట్‌లు