సరిలేరు కలెక్షన్స్ అదుర్స్

అనిల్ సుంకర, దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, నాచురల్ బ్యూటీ రష్మిక మందన్న, డైనమిక్ లేడీ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, తదితరులు కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా వసూళ్ళలో దూసుకు పోతోంది. అటు ఓవర్సీస్ లో సైతం బొమ్మ రఫ్ఫాడిస్తోంది. ఈ మేరకు సినిమా బృదం సక్సెస్ మీట్ కూడా పెట్టారు. ఇదిలా ఉండగా ఒకే ఒక్క రోజులోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ప్రిన్స్ మహేష్ బాబు నటన పీక్ లో ఉండటం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

తాజాగా సరిలేరు నీకెవ్వరు విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. నైజాంలో 8.66 కోట్లు, సీడెడ్‌లో 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.4 కోట్లు, కృష్ణాలో 3.07 కోట్లు, గుంటూరులో 5.15 కోట్లు వసూలయ్యాయి.

ఇక తూర్పుగోదావరిలో 3.35 కోట్లు, పశ్చిమగోదావరిలో 2.72 కోట్లు, నెల్లూరులో 1.27 కోట్ల షేర్ వసూలైనట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. అంతే కాదు విదేశాల్లో సైతం ఈ సినిమా దద్దరిల్లి పోతుందట. మొత్తం మీద వరుస సినిమాలు సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు మహేష్ బాబు, రెడోసారి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, సంగీతాలు ఫుల్ జోష్ మీదున్నారు. సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతే కాదు లాడీ అమితాబ్ ఈ సందర్బంగా అనిల్, మహేష్ బాబును ప్రత్యేకంగా పొగడ్తలతో ముంచెత్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!