ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజీనామా

ప్రముఖ నటుడు, వైసీపీ హార్డ్ కోర్ లీడర్, వైఎస్ జగన్ ఫాలోయర్..ప్రస్తుత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీ  రాజ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఛానల్ లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడంటూ ఆడియో టేపులో సంభాషణలు బయట పడ్డాయి. దీంతో వెంటనే పృథ్వీ పై విచారణ జరిపించాలంటూ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ కూడా జరిపారు. నివేదికను చైర్మన్ కు సమర్పించారు. అయితే దీనిపై పృథ్వీ రాజ్ తీవ్రంగా స్పందించారు. తనపై అంతా కుమ్మక్కై కుట్ర పన్నారని ఆరోపించారు. తాను తాగానని అంటున్నారని, తన బ్లడ్ తీసుకోవచ్చని చెప్పారు.

ఆయన కొన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. పృథ్వీ వీడియో విడుదల చేశారు. నా మీద లేని పోనివి ప్రచారం చేశారని అధిష్టానానికి చెప్పాను. ఒక వేళ వాయిస్‌ నాదైతే ఆఫీసులో అలా ప్రవర్తించాడా, అవుట్‌ సైడ్‌ అలా మాట్లాడుకున్నారా అని ఆలోచిస్తారు. విచారణలో పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. రైతు కష్టాల గురించి నాకు తెలుసు. నా మాటల వల్ల నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెబుతున్నా. పోసాని కృష్ణమురళితో కమ్యూనికేషన్ గ్యాప్‌ను..ఇతర పార్టీల వారు ఉపయోగించుకున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించారని..35 ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలు నిరాధారం.

యూనియన్లతో గొడవలు పడాల్సిన అవసరం లేదు  అని పృథ్వీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో పృథ్వీపై వేటు వేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాజీనామా చేయాలని పృథ్వీకి టీటీడీ అధికారులు ఆదేశాలిచ్చారు. రాజధాని రైతులపై దారుణ వ్యాఖ్యల తర్వాత పృథ్వీని దేవుడే శిక్షించాడంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో వైసీపీలో కూడా కలకలం రేగుతోంది. రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతోందని పృథ్వీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఒక్కొక్కరి గురించి తేల్చి చెపుతానంటూ కామెంట్స్ చేశారు పృథ్వీ రాజ్. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!