ఆన్ లైన్ లో బిగిల్ .. చిత్ర యూనిట్ కు షాక్


ప్రముఖ తమిళ్ సినిమా దర్శకుడు అట్లి దర్శకత్వంలో తీసిన బిగిల్ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఎప్పటి లాగే పైరసీ భూతం బిగిల్ ను వదలలేదు. విడుదలైన కొన్ని గంటల్లోనే అనధికారికంగా ఆన్‌లైన్‌లో పూర్తి సినిమా హల్‌ చల్‌ చేసింది. చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. విజయ్‌ , నయనతార కలిసి నటించిన చిత్రం బిగిల్‌. అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ నిర్మించింది. విడుదలకు ముందు నుంచే మొదలైన బిగిల్‌ చిత్ర రచ్చ ఆ తరువాత కూడా కొనసాగుతోంది. ఈ చిత్రంతో పాటు కార్తీ హీరోగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్, వివేకానంద స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఖైదీ చిత్రం ఒకే సారి విడుదలయ్యాయి.

ఈ రెండు చిత్రాలకు పైరసీ దెబ్బ తగిలింది. బిగిల్‌ చిత్రం విడుదలైన కొన్ని గంటలకే అనధికారికంగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయితే కొంచెం ఆలస్యంగా ఖైదీ చిత్రం ఆన్‌లైన్‌లో హల్‌ చల్‌ చేసింది. అనధికారకంగా, అక్రమంగా ఆన్‌ లైన్‌లో ప్రచారం చేయొద్దని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ తమిళ్‌ రాకర్స్‌ అనే వెబ్‌ సైట్‌ పైరసీకి పాల్పడడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైరసీని అరికట్టడం సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. కాగా బిగిల్‌ చిత్ర విడుదల సమయంలో నటుడు విజయ్‌ అభిమానులు చేసిన వీరంగం పలు విమర్శలకు దారి తీసింది. కృష్ణగిరిలోని ఒక థియేటర్‌ వద్ద అభిమానులు బీభత్సం సృష్టించారు. దీపావళి సందర్భంగా విడుదలయ్యే చిత్రాలకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం చివరికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం విజ్ఞప్తి మేరకు మొదటి రోజు మాత్రం అనుమతినిచ్చింది.

థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శనకు ఆలస్యం కావడంతో విజయ్‌ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. వ్యాపార దుకాణాలపై దాడి చేసి నానా యాగం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టారు. విజయ్‌ అభిమానులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నాన్‌ బెయిలబుల్‌ కేసులను నమోదు చేసి జైలుకు తరలించారు. ఇటీవల నటుడు విజయ్‌ బిగిల్‌ ఆడియో ఆవిష్కరణ వేదికపై తన అభిమానులను ఏమన్నా సహించేది లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కృష్ణగిరి సంఘటనతో ఇలాంటి అభిమానులనా  విజయ్‌ వెనకేసు కొస్తున్నారు అన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సినీ, రాజకీయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే స్పందించే నటి కస్తూరి విజయ్‌ అభిమానుల చర్యల పై తీవ్రంగా స్పందించారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!