అంతటా ఉత్కంఠ..ఎవ్వరో విజేత


తొంబై రోజులుగా బుల్లి తెరపై సంచలనం రేపిన బిగ్ బాస్ రియాల్టీ షోకు కొద్దీ రోజుల్లో శుభం కార్డు పడనుంది. అత్యధిక టీఆర్పీలతో ప్రారంభ మైనప్పటికీ తర్వాత ఆ హవాను కొనసాగించ లేక పోయింది. వైల్డ్‌ కార్డులు, రీ ఎంట్రీలు ప్రవేశ పెట్టినప్పటికీ ప్రేక్షకుల మనసు గెలవలేక పోయింది. బిగ్‌బాస్‌ మొదటి నుంచి ఇస్తూ వచ్చిన టాస్క్‌లు. అష్టా చెమ్మా ఆటల కన్నా అధ్వాన్నంగా ఉన్నాయని నెటిజన్స్ విమర్శించారు. బిగ్‌ బాస్‌ షో క్లైమాక్స్‌ చేరు కోవడంతో, ఇప్పటి కైనా ఆసక్తికర టాస్క్‌లు ఇస్తారే మోనని ఎదురు చూశారు. కానీ అదీ నెర వేరలేదు. కొంత మందికి కాస్త కఠినంగా మరికొంత మందికి సులువైన టాస్క్‌లు ఇచ్చారని తిట్టి పోస్తున్నారు.

ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ పూర్తిగా పక్కన పడేసి, కేవలం ప్రమోషన్స్‌కు మాత్రం బిగ్‌బాస్‌ను భీభత్సంగా వాడుకున్నారన్న వాదన లేక పోలేదు. మొదటి నుంచి ఈ కార్యక్రమంపై వెల్లు వెత్తిన ఆరోపణలకు లెక్కే లేదు. ఈ సీజన్‌లో హౌస్‌మేట్స్‌ గొడవలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొద్దో గొప్పో రాహుల్‌.. పునర్నవిల లవ్‌ట్రాక్‌ కాస్త పర్వాలేదని పించింది. మన్మథుడి హోస్టింగ్‌తో నెట్టుకొద్దామని చూసినప్పటికీ, బిగ్‌బాస్‌ షోలో అసలైన మజా లోపించి టీవీల దగ్గర చతికిల పడి పోయింది. ఇదిలా ఉండగా మొదటి సారి మాటీవీలో ప్రారంభమైన బిగ్ బాస్ షో ను జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ చేశారు.

ఇది 70 రోజులు మాత్రమే కొనసాగింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌ 112 రోజులు పాటు కొనసాగింది. తాజాగా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మూడో సీజన్‌ 105 రోజుల పాటు జరగనుంది. కాగా స్టార్‌ మా ఛానల్‌లో కొత్త సీరియల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ షోను మరింత లేట్‌గా ప్రసారం చేస్తారని సమాచారం. ఏది ఏమైనా ఇప్పటి దాకా ఊరిస్తూ వచ్చిన బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారనేది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 

కామెంట్‌లు