స్మార్ట్ ఫోన్స్ అదుర్స్..షావోమి సెన్సేషన్

ప్రపంచ మార్కెట్ ను ఆర్ధిక మాంద్యం దెబ్బ కొడితే మరో వైపు దానికి భిన్నంగా స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు మాత్రం టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాయి. ఊహించని రీతిలో మొబైల్స్ అమ్ముడు పోవడం మిగతా కంపెనీలను, వ్యాపారులను విస్తు పోయేలా చేసింది. ఈ ఏడాది క్యూ3లో రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు అమ్ముడు పోయాయి.  యాపిల్, శాంసంగ్ దిగ్గజ కంపెనీల ఫోన్లు మాత్రం అంతగా అమ్ముడు పోలేదు. దీంతో ఈ కంపీల సేల్స్ అమాంతం పడిపోయాయి. ఈ అమ్మకాల్లో చైనాకు చెందిన కంపెనీల మొబైల్స్ టాప్ రేంజ్ లో నిలిచాయి. ఇందులో రారాజుగా ఇదే కంట్రీకి చెందిన షావోమి స్మార్ట్ ఫోన్ మొదటి ప్లేస్ లో నిలిచింది.

భారీగా ఆఫర్స్, గిఫ్ట్స్ ప్రకటించింది రెడ్ మీ. దసరా, దీపావళి పండుగ సీజన్లో స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. ఆఫర్లను ప్రకటించడంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడయింది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఆకర్షణీయమైన ప్రమోషన్లు  పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పెంచడంతో కీలకంగా నిలిచిందని తెలిపింది. ఒక వైపు దేశీయంగా ఆటో, రియల్టీ సహా పలు రంగాల్లో మంద గమనం..కొనసాగుతోంటే,
స్మార్ట్‌ ఫోన్స్ మార్కెట్‌ మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం.

ఈ విక్రయాల్లో చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమి తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్‌ ధరల్లో వివిధ స్మార్ట్‌ ఫోన్లను తీసుకొస్తూ భారతీయ స్మార్ట్‌ఫోన్‌ వినియోగ దారులను ఆకట్టు కుంటోంది. షావోమి మార్కెట్ వాటా 26 శాతం చేజిక్కించుకుని టాప్‌ వన్ లో నిలిచింది. 20 శాతం వాటాతో శాంసంగ్, 17 శాతంతో వివో తర్వాతి స్థానాలను దక్కించు కున్నాయి. రియల్ మీ 16 శాతం, ఒప్పో 8 శాతం సాధించాయి. మొత్తం మీద దిగ్గజ కంపెనీలను కాదని రెడ్ మీ తన హవా ను కొనసాగిస్తోంది.

కామెంట్‌లు