చివరి అంకానికి బిగ్ బాస్

తెలుగు బుల్లి తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళుతున్న బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. గత పద్నాలుగు వారాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ మరో వారం రోజుల్లో ముగియనుంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇక ఈ వారం అలీ రెజా, శివ జ్యోతి, వరుణ్‌, శ్రీముఖి నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎపి సోడ్‌లో ఒకరు లేదా ఇద్దరు సేవ్‌ అయ్యే అవకాశం ఉందని హోస్ట్‌ నాగార్జున చెప్పాడు. ఎవరెవరు సేవ్‌ అవుతారో తెలుసు కోవడానికి దీపావళీ సందర్భంగా..వారి పేర్లు రాసి ఉన్న పార్టీ పూపర్స్‌ గన్‌ తలా ఒకటి ఇచ్చి పేల్చమని చెప్పాడు.

ఎవరి గన్‌ నుంచి రంగు రంగుల కాగితాలు బయటికి వస్తాయో..వారు సేవ్‌ అవుతారని తెలిపాడు. మిగిలిన వారు నామినేషన్‌లోనే ఉంటారని చెప్పాడు. ముందుగా వరుణ్‌, తర్వాత అలీ గన్‌ పేల్చగా..వాటిల్లో ఎలాంటి రంగులు రాలేదు. దీంతో వారిద్దరూ సేవ్‌ కాలేదని హోస్ట్ నాగార్జున తెలిపాడు. ఇక శివజ్యోతి, శ్రీముఖి వారి చేతుల్లో ఉన్న గన్‌లను పేల్చలేక పోయారు. రెండో ప్రయత్నంలో భాగంగా శ్రీముఖి గన్‌ పేల్చగా..దాట్లోంచి రంగుల కాగితాలు వచ్చాయి. శ్రీముఖి సేవ్‌ అయి టికెట్‌ టు ఫినాలేకు చేరుకున్నట్టు నాగ్‌ ప్రకటించాడు.

ఇక శివజ్యోతి గన్‌లో నుంచి ఎలాంటి రంగుల కాగితాలు రాక పోవడంతో ఆమె కూడా సేవ్‌ కాలేదని నాగ్‌ వెల్లడించాడు. వరుణ్‌, శివజ్యోతి, అలీరెజా ముగ్గురూ నామినేషన్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటికే సింగర్ రాహుల్‌, బాబా భాస్కర్‌ టికెట్‌ టు ఫినాలె గెలుచుకుని టాప్‌ 5కి చేరారు. మిగిలిన ముగ్గురిలో ఫైనల్‌లో పోటీ పడే ఆ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది నడుస్తున్న ఎపిసోడ్‌లో తేలనుంది. అయితే, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తక్కువగా ఉన్న శివ జ్యోతి ఎలిమినేట్‌ అయినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. మరో వారం రోజుల పాటు బిగ్‌బాస్‌ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!