చర్చలు విఫలం..సమ్మె యథాతథం
ప్రభుత్వం తన మంకు పట్టు వీడడం లేదన్న సంగతి మరోసారి రుజువైంది. రాష్ట్ర హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై సీరియస్ అయ్యింది. వారితో బేషరతుగా చర్చలు జరపాలని ఆదేశింది. అంతే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు సర్కారు చొరవ చూపాలని ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో ప్రజాగ్రహం వెల్లువెత్తితే తట్టు కోవడం కష్టమని, ఫిలిప్పైన్స్ లో రూఢీ అయ్యిందని స్పష్టం చేసింది. అంతే కాకుండా సమ్మె చేయడం కార్మికుల ప్రాథమిక హక్కు అని గుర్తు చేసింది కోర్టు. ఇదే సమయంలో కార్మిక సంఘాలు పండుగ వేళ సమ్మెకు దిగడం భావ్యం కాదన్నది. వెంటనే చర్చలు జరిపి తీరాల్సిందేనంటూ కోర్టు పేర్కొంది.
విలీనం చేయాలనీ, మిగతా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఉధృతంగా మారింది. ఈ మేరకు అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఓ మెట్టు దిగాయి. సంఘాల నాయకులతో యాజమాన్యం చర్చలు జరిపింది. అవి పూర్తిగా అర్ధాంతరంగా ముగిశాయి. మొత్తం డిమాండ్ల పరిష్కారానికి కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టడంతో చర్చలు చివరి వరకు కొనసాగలేదు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చర్చలకు వచ్చారు. ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానియా చర్చల్లో పాల్గొన్నారు.
నలుగురు కార్మిక నేతలను మాత్రమే చర్చలకు అనుమతించారు. వారి ఫోన్లను అనుమతించ బోమని అధికారులు చెప్పడంతో కార్మిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. ప్రధాన డిమాండ్ ఆర్టీసీ విలీనంపై కార్మిక సంఘాల నాయకులు పట్టుబట్టడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. అనంతరం జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి లు మాట్లాడారు. ఒక భయానక వాతావరణంలో చర్చలు జరిపారని చెప్పారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదన్నారు. ప్రభుత్వం కావాలని పిలిచి తమను అవమాన పరిచిందని ఆరోపించారు. సమ్మె యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా హైకోర్టు చెప్పిన మేరకు 21 డిమాండ్లపైనే చర్చించడం జరిగిందని ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ చెప్పారు. జేఏసీ వాళ్ళే అర్ధాంతరంగా వెళ్లి పోయారని చెప్పారు. వెయిట్ చేసినా నేతలు రాలేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి