జయహో బుమ్రా..మందాన


ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన పురస్కారం ఏమిటంటే అది విజ్డన్‌ మాత్రమే. క్రికెట్ ఆటలో అత్యుత్తమమైన ప్రతిభను ప్రదర్శించిన ఆటగాళ్లకు ఈ అవార్డు ను ప్రకటిస్తారు. గతంలో మన టీమిండియాకు చెందిన ఆటగాళ్లకు విజ్డన్‌ అవార్డు వరించింది. తాజాగా భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, బ్యాట్స్‌ వుమన్‌ స్మృతి మంధానాలకు ప్రతిష్ఠాత్మక మైన విజ్డన్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. విజ్డన్‌ ఇండియా అల్మ నాక్‌ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ను బుమ్రా, స్మృతి గెలుచుకున్నారు. ఈ అవార్డు కోసం  ప్రకటించిన ఐదుగురు ఆసియా విజేతల్లో ఇద్దరు మనోళ్లే ఉండడం విశేషం.

మిగతా ముగ్గురు పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌, శ్రీలంకకు చెందిన దిముత్‌ కరుణ రత్నె, అఫ్ఘానిస్థాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ లు చోటు దక్కించుకున్నారు. ఈ ఆటగాళ్లు ఆయా జట్లకు కీలకంగా ఉన్నారు. విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు.  కాగా.. భారత యువ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ పేరు కూడా విజ్డెన్‌ పత్రికలో చోటు దక్కింది. 2019, 2020కి గాను ఏడో ఎడిషన్‌ వార్షిక క్రికెట్‌ సంచికల్లో మయాంక్‌ అగర్వాల్‌కు సంబంధించి ప్రత్యేక కథనం ముద్రించారు. దక్షిణాఫ్రికాతో ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్‌లో మయాంక్‌ అగర్వాల్ డబుల్‌ సెంచరీతో దుమ్ము రేపాడు.

కాగా మిథాలీ రాజ్‌, దీప్తి శర్మ తర్వాత విజ్డన్‌ అవార్డుకు ఎంపికైన మూడో భారతీయ మహిళా క్రికెటర్‌ గా స్మృతి మందాన చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉండగా భారత మాజీ ఆటగాళ్లు గుండప్ప విశ్వనాథ్‌, లాలా అమర్‌నాథ్‌ విజ్డన్‌ ఇండియా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. వీరు టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాలను  అందించారు. మొత్తం మీద ప్రతిష్టాత్మకమైన విజ్డన్‌ అవార్డు మన ఆటగాళ్లకు దక్కడంతో క్రికెట్ ప్రేమికులు సంబరాలు చేసుకుంటున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!