సీఎం భారీ నజరానా

కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టడమే కాకుండా భారీ మెజారిటీని కట్టబెట్టిన హుజూర్ నగర్ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారు అడిగిన దాని కంటే ఎక్కువగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 43 వేలకు పైగా మెజారిటీ కట్టబెట్టారు. ఇక్కడ అధికార పార్టీకి ఈ ఎన్నిక గెలవడం తప్పనిసరిగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ప్రచారం. పలువురు ఈ ఉపఎన్నికలో పోటీ చేసినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల అభర్ధుల మధ్యనే నడిచింది. అంతకు ముందు దీనిని అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా సరే గెలవాలన్న పట్టుదలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇక్కడ మోహరించారు.

విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదే సమయంలో ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా రాడ్ షో లో పాల్గొన్నారు. ఉత్తమ్ భార్యను గెలిపిస్తే వాళ్ళు మాత్రమే బాగు పడతారని, కానీ తమ పార్టీకి చెందిన సైదిరెడ్డి గెలిస్తే నియోజక వర్గం మొత్తం బాగుపడుతుందని చెప్పారు. ఇదే ఎన్నికల నినాదంగా మారింది. బడా నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. అయినా కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. సైదిరెడ్డి గెలుపొందడంతో హుజూర్ నగర్ లో విజయోత్సవ సభ చేపట్టారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హుజూర్ నగర్ ప్రజలకు అభినందనలు..తెలిపారు.

మంచి యువకుడిని ఎన్నుకున్నారని అన్నారు. పెద్ద ఎత్తున వరాల జల్లులు కురిపించారు సీఎం. ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షల నిధులిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒక్కో మండల కేంద్రానికి 30 లక్షలు ఇస్తామని అలాగే.. రోడ్ల అభివృద్ధికి 25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నేరేడుచెర్ల మున్సిపాలిటీకి 15 కోట్లు ఇస్తామని కేసీఆర్ సభా ముఖంగా చెప్పారు. మొత్తం మీద ఇదే జోరును రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చూపించాలని కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!