గంగూలీ సింప్లిసిటీ నచ్చింది


సౌరబ్ గంగూలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో కొన్నేళ్లుగా ఆట పరంగా, స్నేహ పరంగా బంధం కొనసాగుతూ వస్తోంది. నా ఒక్కరిలోనే కాదు చాలా మంది క్రికెటర్లు కూడా ఇలాంటి అనుభవాన్ని పొందుతున్నారని భావిస్తున్నా. ఎందుకంటే గంగూలీకి ఏ సమయంలో దాదా అని పేరు పెట్టారో నాకిప్పుడు అర్థమయింది. వృత్తి పరంగా ఎంతో దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. అదే స్ఫూర్తి ఆయనలో ఇప్పటికీ అలాగే ఉన్నది. ఇది నన్ను విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం గంగూలీ బిసిసిఐకి ప్రెసిడెంట్ అయ్యారు. అది అత్యంత కీలకమైన పదవి. క్రికెట్ ఆటను నిర్దేశించి, శాసించే సమయం ఒక్క ప్రెసిడెంట్ కే ఉంటుంది. దీంతో పాటు క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక కూడా చాలా క్లిష్టమైన పదవి.

ఇప్పుడు దాదా కొలువు తీరాడు. ఆయన సారధ్యంలో భారత క్రికెట్ కు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాని చెప్పారు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన సౌరవ్‌ గంగూలీని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ సన్మానించింది. ఇదే కార్యక్రమానికి లక్ష్మణ్‌ హాజరయ్యారు. తన గత అనుభవాల్ని నెమరు వేసుకున్నాడు. 2014లో క్యాబ్‌ జాయింట్‌ సెక్రటరీగా గంగూలీ పని చేస్తున్న సమయంలో లక్ష్మణ్‌..బెంగాల్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సేవలు అందించాడు. గంగూలీని కలవడానికి వెళ్లిన లక్ష్మణ్‌కు ఊహించని పరిణామం ఎదురైందట. క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగి, భారత క్రికెట్‌ను ఒక ఉన్నత స్థాయిలో నిలిపిన కెప్టెనే కాకుండా, వరల్డ్‌ క్రికెట్‌లో ఒక లెజెండ్‌ అయి నటువంటి గంగూలీని ఆ రూమ్‌లో చూసి లక్ష్మణ్‌ షాక్‌ తిన్నాడట.

రాష్ట్ర అసోసియేషన్‌లోని ఒక చిన్న గదిలో గంగూలీ కూర్చొని ఉన్నాడు. నన్ను షాక్‌కు గురి చేసింది. అది చాలా చిన్న రూము. అందులో క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా గంగూలీ సేవలందిస్తున్నాడు. ఇది నాకు ఊహించని విషయం. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యా. కానీ అది నాలో స్ఫూర్తిని నింపింది అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్‌తో పాటు అజహరుద్దీన్‌ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తంగా చూస్తే గంగూలీ అంటే ఇప్పటికే అర్థమై పోయి ఉంటుంది తన సత్తా ఏపాటిదో. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!