రాములమ్మ లుక్స్ అదుర్స్

తెలుగు సినీ రంగంలో రాములమ్మగా పేరొందిన విజయశాంతికి ఓ స్పెషాలిటీ ఉంది. ఆమె కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రధాన పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. దీంతో మహేష్, రాములమ్మల కాంబినేషన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ప్రిన్స్ ఫ్యాన్స్ లో నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా డైరెక్టర్ అనిల్ విజయశాంతి న్యూ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. బ్రేక్‌ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకే ఒక్క స్టిల్‌తో అందరికి సమాధానం ఇచ్చారు.

రాములమ్మగా, లేడీ అమితాబ్ గా ఆమెను పిలవడం పరిపాటి. ఇటీవల మహేష్ బాబుతో నటించడం తనను ఎంతో సంతోషానికి గురి చేస్తోందన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్‌.. మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఆమె భారతి పాత్రలో చాలా డీసెంట్‌ అండ్‌ క్లాస్‌గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది.

అయితే మరో యాంగిల్‌లో తన చూపుతోనే విలన్‌లకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనబడుతోంది.ప్రస్తుతం విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రిన్స్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో మహేష్‌ ఒదిగిపోయారని, సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు సంక్రాంతికి డబుల్‌ ధమాకా అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.

కామెంట్‌లు