లాభాల బాటలో ఎస్‌బీఐ
భారత దేశంలో అతిపెద్ద బ్యాంకు గా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాల బాట పట్టింది. ఇప్పటికే మోదీ సంస్కరణలు ప్రజల పాలిట, బ్యాంకుల పాలిట శాపంగా మారాయి. గత కొంత కాలంగా ఖాతాదారులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి ఎస్‌బీఐలో. దీని వల్ల కొంత మేర సానుకూల ఫలితాలు రావడం మొదలు పెట్టాయి. అంతకు ముందు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల సిబ్బంది, ఉద్యోగులు సమ్మె చేపట్టారు. తాజాగా ద్వితీయ త్రైమాసికానికి కళ్లు చెదిరే ఆర్థిక ఫలితాలను ఎస్‌బీఐ సాధించింది. బ్యాంకు కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు ఆరు రెట్లు పెరిగి 3,375.40 కోట్లకు చేరుకుంది.
కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు 576.46 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలంలో మొత్తం ఎస్‌బీఐ గ్రూప్ ఆదాయం 79,302.72 కోట్ల నుంచి 89,347.91 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి 24,600 కోట్లకు చేరుకుంది. ఇది అంచనాలకు మించి ఉండటం విశేషం. మిగతా బ్యాంకులకు ఒక రకంగా షాక్. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో వాటాను విక్రయించడం వల్ల బ్యాంకు లాభాలు పెరిగే అవకాశం ఏర్పడింది. అనుబంధ సంస్థలో వాటాను 62.10 శాతం నుంచి 57.60 శాతానికి తగ్గించుకుంది.
వాటా విక్రయం ద్వారా ఎస్‌బీఐకి 3,500 కోట్ల లాభం సమకూరింది. దీంతో పాటు బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగు పడింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో కొంత మంది కార్పొరేట్లు మంజూరు చేసిన నిర్వహణ మూలధన పరిమితులను తగ్గించు కున్నారు. రుణాల్లో వృద్ధి తక్కువ స్థాయికే పరిమితం కావడం వల్ల రిటైల్ రుణాలపై దృష్టి సారించాల్సి వచ్చింది. దీంతో ఇంతకు ముందు 19 శాతంగా ఉన్న ఈ రుణాలు 60 శాతానికి పెరిగాయి. అయితే పరిస్థితులు మారిన తర్వాత కార్పొరేట్ రుణాల వాటా మళ్లీ పెరిగే అవకాశం ఉంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి