మార్చుకున్న వ్యూహం..యెడ్డీకి అనుకూలం

నిన్నటి దాకా మోడీ, అమిత్ షా ఏది చెబితే అది వేదంగా, చట్టంగా అమలవుతూ వచ్చింది. అంతకంటే ఎక్కువగా అమిత్ షా సౌత్ ఇండియాపై కన్నేసి ఉంచాడు. కన్నడ నాట కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కారు ను పడగొట్టి యెడ్యూరప్ప నేతృత్వంలో కమలానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇదే సమయంలో యెడ్డీకి..హైకమాండ్ కు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. దీంతో ఎడ్డీ కూడా మౌనంగా వుండి పోయారు. తాను అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క పనికీ ఆమోదం లభించలేదు. దీంతో కొంత గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బీజేపీకి అనుకున్నంతగా ఓటు బ్యాంక్ రాలేదు. దాదాపు 21 శాతానికి పైగా పడి పోయింది. ఒకవేళ ఇక్కడ గనుక మెరుగైన రిజల్ట్స్ వచ్చి ఉంటే యెడ్డీకి ఇంకా కష్టాలు మొదలయ్యేవి.

మరో వైపు బీజేపీ అధిష్ఠానం కూడా తన వ్యూహం మార్చుకుంది. మధ్యంతర పోరు ద్వారా యడ్డీకి చెక్‌ పెట్టి, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న యోచన మానుకొని, ఉప సమరం పైనే పెట్టడంతో యడ్యూరప్పకు కాస్త ఉపశమనం కలిగింది. అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన యెడ్డీకి అధిష్ఠానం మద్దతు అరకొరే అని చెప్పాలి. సీనియర్‌ నేత అని కుర్చీ అప్ప జెప్పిందే కానీ, ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వక లేదు. మంత్రివర్గ విస్తరణ, వరద పరిహారంలో కేంద్ర సాయం, పార్టీ అధ్యక్షుడుతో అంతర్యుద్ధం తదితర అంశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న యడ్డీకి మహా ఫలితాలు గట్టెక్కించేలా ఉన్నాయి. హై కమాండ్ కర్ణాటక విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని నిశ్చయించు కున్నట్టు తెలుస్తోంది.

సాంగ్లి, కొల్హాపుర జిల్లాల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. కర్ణాటకలోనూ వరద పీడిత ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా పట్టించు కోవడం లేదన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. రాష్ట్రంలో యడియూరప్ప సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం, ప్రధాని నరేంద్ర మోదీకి గానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు గానీ సుతారం ఇష్టం లేదు. అధిష్ఠానం పెద్దలను ఒప్పించి ఎడ్డీ ముఖ్యమంత్రి కాగలిగారు గానీ అటు వైపు నుంచి సహకారాన్ని పొందలేక పోయారు. ఒక రకంగా యడియూరప్ప సర్కార్‌ అధిష్ఠానంపై ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి కుర్చీకి మాత్రం ఢోకా లేదన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!