మోదీకి మహిళా ప్లేయర్ల వందనం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అన్ని వైపుల నుంచి ప్రసంశలు లభిస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎందరినో ప్రభావితం చేస్తున్నాయి. అమెరికాలో ఇటీవల పర్యటించిన మోదీకి ఘన స్వాగతం లభించింది. అంత కంటే ఎక్కువగా అమెరికన్లతో పాటు ప్రవాస భారతీయుల మనసు దోచుకున్నారు. దీంతో మోదీ గ్రాఫ్ మరింత పెరిగింది. దేశంలో ఏది జరిగినా వెంటనే స్పందించడం అలవాటుగా మార్చుకున్నారు మోదీ. అంతే కాకుండా ఎక్కువగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పై దృష్టి పెట్టారు. ఎక్కడ చెత్త వేసినా దానిని తీసి వేయాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. క్రీడల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు.

అందులో భాగంగా ఆటగాళ్లకు నజరానాలు, బహుమతులు ప్రకటిస్తున్నారు. తాజాగా నరేంద్ర మోదీజీ భారత్‌ లక్ష్మీ పేరుతో కొత్త కార్యక్రమం ప్రకటించారు. ఈ పిలుపు పలువురు స్టార్‌ మహిళా క్రీడాకారిణుల మనసును తాకింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు, బాక్సర్లు మేరీకోమ్, నిఖత్‌ జరీన్, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మని కా బాత్రా, రెజ్లర్‌ పూజ ట్విట్టర్‌ వేదికగా ‘భారత్‌ లక్ష్మీ’ కార్యక్రమానికి తమ మద్దతును ప్రకటించారు. ఈ చర్య అమ్మాయిలు తమ రంగాల్లో మరింతగా రాణించేందుకు ప్రేరణ ఇస్తుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు దర్పణంగా నిలుస్తుందన్నారు. భారత్‌ లక్ష్మీ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అంటూ వారు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలు పంచుకున్నా రు. అమ్మాయిల్ని సాక్షాత్తు లక్ష్మీ దేవిగా ఈ దేశంలో అందరూ భావిస్తారు. దేశంలోని ప్రతి రంగంలో ఎందరో మహిళలు రాణిస్తున్నారు. ప్రధానంగా క్రీడా, వ్యాపార, ఐటీ, సినిమా రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా తగిన విధంగా గౌరవించండంటూ ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ‘భారత్‌ లక్ష్మీ’ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చారు. దీనికి బిగ్ రెస్పాన్స్ వస్తోంది. మొత్తం మీద మోదీ ఈ రూపకంగా మరోసారి వైరల్ గా మారారు.

కామెంట్‌లు