కొలువుల కల్పనలో కాషాయం విఫలం
ఇదే సమయంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల కల్పన దారుణంగా పడి పోయింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరోల్ డేటా ప్రకారం గత ఆగస్టులో 13 లక్షల ఉద్యోగ అవకాశాలు రాగా, అంతకు ముందు నెలలో ఈ సంఖ్య 14.49 లక్షలు మాత్రమే నమోదైంది. ఇఎస్ఐసీ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహించే వివిధ సామాజిక భద్రతా పథకాల్లో చేరిన కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్‌ఎస్‌ఓ నివేదికను రూపొందిస్తుంది.
దీని ప్రకారం సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు ఇఎస్ఐసీ లో 83.35 లక్షలుగా ఉందని నివేదిక చూపించింది. ఈ ఏడాది జూలైలో 11.71 లక్షలతో పోలిస్తే ఆగస్టులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తో 10.86 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే నమోదయ్యాయి. 2018-19లో నికర ప్రాతి పదికన 61.12 లక్షల మంది కొత్త చందాదారులు ఇపిఎఫ్‌ఓ నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాలలో చేరారు. మొత్తంగా చూస్తే కొలువుల కల్పన అనేది ఓ కలగా మిగిలింది అన్నది వాస్తవం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి