యాంకర్ రవి హాట్ కామెంట్స్
స్టార్ మా టీవీలో జనాదరణ పొందిన బిగ్ బాస్ పై ప్రముఖ బుల్లితెర యాంకర్ రవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఫైనల్ లో ఎవరు గెలుస్తారో తనకు తెలుసు అని, అయితే ఆ పేరు మాత్రం తాను వెల్లడించ దల్చు కోలేదని రవి స్పష్టం చేశారు. కాగా బిగ్ బాస్ రియాల్టీ షోకు త్వరలోనే శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా, వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు ఒక్కసారిగా సెలబ్రెటీలుగా మారి పోయారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. వీరు గెలవాలని కోరుతూ ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ గా మార్చే పనిలో పడ్డారు. ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు.
సెలబ్రీటీలు సైతం అభిమానులతో పాలు పంచుకుంటున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్టు చేయాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇప్పటికే శ్రీముఖికి జబర్దస్త్ యాంకర్ రష్మీ, రాంప్రసాద్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ రవి కూడా తన బెస్ట్ ప్రెండ్ అలీ రేజాకి మద్దతు తెలిపాడు. తన స్నేహితున్ని గెలిపించాలని కోరుతూ ఫేస్‌బుక్ లో లైవ్ చేపట్టారు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న అందరూ తనకు ఇష్టమేనని, కానీ తన మద్దతును మాత్రం అలీ రెజాకే ఇస్తానని తెలిపాడు. మా మధ్య మంచి బంధం ఉంది. అలీ నాకు సొంత అన్న లాంటి వాడు. అందుకే అతనికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాడు. ఇది పక్కా బిజినెస్.
ఒక గంట చూసి ఒకరు మంచోడు ఒకరు చెడ్డోడు అని ఎలా డిసైడ్ అవుతారు. అది ఒక గేమ్..అంతా చూపించరు. దయచేసి ట్రోలింగ్ చేయకండి అని రవి కోరారు. శ్రీముఖి నా కోయాంకర్ మాత్రమే. మా మధ్య మంచి బాండ్ ఉంది. తను కూడా గేమ్ బాగా ఆడుతోంది. ఈ విషయాన్ని నేను బిగ్‌బాస్ షోకి వెళ్లినప్పుడు కూడా చెప్పాను. అయినా ట్రోల్ చేస్తున్నారు. శివజ్యోతికి బిత్తిరి సత్తి సపోర్ట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కరు నచ్చుతారు. అలీ నా అన్న లాంటి వాడు అందుకే శ్రీముఖిని కాదని అతనికి సపోర్ట్ చేస్తున్నా అని స్పష్టం చేశాడు రవి. మొతం మీద రవి కామెంట్స్ తో బిగ్ బాస్ మరోసారి వైరల్ గా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి