జనసందోహం డీకే ఆనందం
కాంగ్రెస్ సీనియర్ లీడర్, ట్రబుల్ షూటర్, కన్నడ రాజకీయాల్లో విస్మరించలేని నాయకుడిగా పేరున్న డేకి శివకుమార్ తొలిసారిగా తన మాతృభూమిపై కాలు మోపారు. మనీ ల్యాండరింగ్ కేసులో తీహార్ జైలులో గడిపారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సీబీఐ, ఈడీ సుప్రీం కోర్టులో నామినేషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో కర్ణాటకలో బలమైన నాయకుడిగా డీకే శివకుమార్ కు పేరుంది. చాలా మంది నాయకులు కేంద్రంలోని బీజేపీ పట్ల మౌనంగా ఉండగా, డీకే మాత్రం తాను ఏ మాత్రం తగ్గలేదు. కన్నడ నాట కొలువు తీరిన కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోకుండా కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేశాడు.
అయినా ఫలితం లేక పోయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇదే సమయంలో బీజేపీ కింగ్ మేకర్ అమిత్ షా కన్ను డీకేపై పడింది. ఎలాగైనా సరే డీకేను జైలుకు పంపించాలని డిసైడ్ అయ్యాడు. ఇంకేం సీబీఐ, ఈడీ రంగంలోకి దిగింది. డీకేను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించింది. దీంతో అధికార పార్టీకి చెందిన బీజేపీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సైతం ఆవేదన వ్యక్తం చేశారు. డీకే తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని సీఎం చెప్పాడు. దీనిపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బెయిల్ మంజూరు కావడంతో డీకేకు బెంగళూర్ లో అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది.
సుమారు 50 రోజుల పాటు విచారణ ఖైదీగా జైలులో శిక్ష అనుభవించారు. డీకేకు బెయిలు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఆయన ప్రస్తుతం అధికారంలో లేరని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశమే లేదన్న శివకుమార్ తరఫు లాయర్ వాదనను కోర్టు సమర్ధించింది. 25 లక్షల పూచీ కత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ట్రయిల్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, విచారణకు ఎప్పుడు పిలిచినా అందు బాటులో ఉండాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని డీకేకు కోర్టు షరతులు విధించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి