బిగిల్ మూవీకి తప్పని తిప్పలు

అట్లి దర్శకత్వంలో రైజింగ్ స్టార్ విజయ్ నటించిన బిగిల్ సినిమాకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేశ మంతటా ఈ సినిమా గురించిన చర్చ నడుస్తోంది. 187 కోట్లు పెట్టి బిగిల్ సినిమాను తీశాడు అట్లి. తీసింది కేవలం మూడు సినిమాలే అయినా మనోడు ఇప్పుడు తమిళ్ లో టాప్ డైరెక్టర్. ప్రముఖ దర్శకుడు శంకర్ కు అట్లి ప్రియ శిష్యుడు. టేకింగ్ లోను, సినిమా తీయడంలోనూ అట్లి వెరీ డిఫరెంట్. దీపావళి రోజున బిగిల్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సినిమాకు ముందు నటుడు విజయ్ కొన్ని కామెంట్స్ చేశాడు. దీంతో పెద్ద దుమారం చెలరేగింది. కాగా వర్షం వస్తున్నా అక్కడ ఫ్యాన్స్ మాత్రం భారీగా అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎగబడుతున్నారు.

తలైవా, కత్తి, తుపాకీ చిత్రాల నుంచి ఆ మధ్య తెరపైకి వచ్చిన మెర్శల్, సర్కార్‌ చిత్రాల వరకూ కథల తస్కరణ ఆరోపణలు, కోర్టులు, కేసులు, ప్రభుత్వ ఆంక్షలు అంటూ రచ్చ జరుగుతూనే ఉంది. ఆ రచ్చ నుంచి విజయ్‌ నటించిన తాజా చిత్రం బిగిల్‌ కూడా తప్పించు కోలేక పోయింది. చిత్ర ఆడియో విడుదల సమయంలోనే వివాదాలను ఎదుర్కొంది. విజయ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీంతో అప్పుటి నుంచి బిగిల్‌ చిత్రంపై రచ్చ స్టార్ట్‌ అయ్యింది. మరో వైపు బిగిల్‌ కథ తమదే నంటూ కొందరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒక పిటీషన్‌ విచారణకు రానుంది. ఇదిలా ఉండగా విజయ్‌ చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌లు ఇస్తూనే ఉంది. బిగిల్‌ ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు అనుమతి లేదంటూ స్పష్టం చేసింది. మంత్రి కడంబూర్‌ రాజు ప్రత్యేక షోలకు అనుమతి లేదంటూ వెల్లడించారు.

భారీ బడ్జెట్‌తో బిగిల్‌ తెరకెక్కింది. సినిమా బిజినెస్‌ కూడా అదే రేంజ్‌లో జరిగింది. ప్రత్యేక షోలు పడితేనే బయ్యర్లు కానీ, థియేటర్ల యాజమాన్యం పెట్టుబడిని రాబట్టకుని బతికి బట్టగలిగే పరిస్ధితి. వారందరికీ షాక్‌ ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరించింది. చిత్ర నిర్మాత ఎజీఎస్‌ సంస్థ అధినేత అఘోరం, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ తిరుపూర్‌ సుబ్రమణియన్‌ ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మంత్రి కడంబూర్‌ రాజుపై నటుడు విజయ్‌ అభిమానులు విరుచుకు పడుతున్నారు. మొత్తం మీద విజయ్‌ చిత్రం ఆయన అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య చిచ్చు రాజేసింది. ఏది ఏమైనా అట్లి సినిమా కోసం వేలాది మంది వేచి చూడడం విశేషం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!