కాంగ్రెస్ కు రాహులే దిక్కు
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జవసత్వాలు కోల్పోయి అంపశయ్యపై కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు ను కోల్పోయింది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండగా మరో వైపు బీజేపీ మాత్రం తన హవాను కొనసాగిస్తూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలన్నదే మోడీ అండ్ అమిత్ షా టార్గెట్. ఇందు కోసం ప్రధాన లీడర్స్ అందరిని జైలు పాలు చేస్తున్నారు. మరో వైపు అమెధీలో పోటీ చేసిన రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. అయినా ఆయన తన పనితీరును మార్చు కోవడం లేదు. పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేలా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
ఇదే సమయంలో ప్రియాంక గాంధీ పేరు ప్రముఖంగా వినిపించింది. మరోసారి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే సమాచారం. పార్టీలోని వివిధ వర్గాల నుంచి తీవ్రంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో రాహుల్ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్నారని చెబుతున్నారు. ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిని చేయాలని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ చాలా కీలకమని, అందువల్ల ఆ రాష్ట్రంపై మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సోనియాగాంధీ ఇప్పటికే ప్రియాంక గాంధీకి సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం అధ్యక్షురాలిగా తాను ఉన్నప్పటికీ.. తన ఆరోగ్యం బాగా లేక పోవడం వల్ల.. రాహుల్ మరోసారి పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సోనియా కోరుకుంటున్నారని పేర్కొన్నాయి. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో డిసెంబర్ నెలలో ఏఐసీసీ భేటీ జరిగే అవకాశముందని వెల్లడించాయి. 17 మంది పార్టీ సీనియర్ సభ్యులతో ఒక పాలసీ అండ్ స్ట్రాటెజీ గ్రూప్‌ను సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. ఆ బృందంలో రాహుల్ గాంధీ సభ్యుడిగా ఉన్నారు కానీ ప్రియాంక గాంధీ లేకపోవడం గమనార్హం.
రాహుల్‌కు సన్నిహితులైన పలువురు యువ నేతలకు కూడా ఈ బృందంలో చోటు దక్కింది. దీంతో రాహుల్ మరోసారి క్రియాశీలకం కానున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగొయి, సుశ్మిత దేవ్, రాజీవ్ సతవ్, జ్యోతిరాదిత్య సింధియా, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా.. తదితరులున్నారు. మొత్తం మీద మరోసారి రాహుల్ పగ్గాలు చేపడితే ఏం జరుగుతుందో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి