జగన్ లక్ష్యం..ఆరోగ్యం..మహా భాగ్యం

ఏపీలో వైసీపీ కొలువు తీరాకా పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. పాలనలో తనదైన ముద్రను కనబరుస్తున్నారు. పేదలు, సామాన్యులకు ఎలా మేలు చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నారు. వారి కోసం సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆటో వాలాలకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన ప్రారంభించారు. తనను నమ్ముకున్న వారికి ఉన్నతమైన పదవులు కట్టబెట్టారు. తాజగా ఏపీపీఎస్సి లో ఇద్దరికీ చోటు కల్పించారు. మొత్తం మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా జగన్ మోహన్ రెడ్డి మాత్రం డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నారు. వేలాది ఖాళీలను భర్తీ చేశారు.

ఏపీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒక్కసారిగా జగన్ పేరు మారుమ్రోగింది.జగన్  పేరు వైరల్ గా మారింది. ఇక రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంద్ర ప్రదేశ్ గా మార్చేందుకు ఏపీ సీఎం కంకణం కట్టుకున్నారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. వైఎస్సార్‌ అమృత హస్తం, వైఎస్సార్‌ బాల సంజీవని కింద గర్భవతులు, పిల్లలకు మరింత పౌష్టికాహారం అంద జేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

గర్భవతులు, బాలింతలకు నెలకు 1062 విలువైన, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు నెలకు 600 విలువైన, 3 – 6 ఏళ్ల లోపు పిల్లలకు నెలకు  560 విలువైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల్లో డిసెంబర్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని అన్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి.. పిల్లలు ఏం తింటున్నారన్నది గమనించి, తదుపరి చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!