తల్లి కోసం తనయుడి త్యాగం
కన్నవారు బరువై పోతున్నారంటూ పొద్దస్తమానం అమెరికా జపం చేస్తూ డాలర్ల వేటలో మునిగి పోయిన కొడుకులకు కనువిప్పు కలిగించే కథ ఇది. పలకరింపే కరువై పోయి ఆసరా కోసం ఎదురు చూస్తూ వృద్దాశ్రమాలల్లో ఉంటున్న వారు ఎందరో. పేరెంట్స్ ను పట్టించుకోని ప్రబుద్ధులు తల దించుకునేలా చేశాడు కర్ణాటక లోని మైసూర్ కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్. ఆయన తల్లి కోసం ఏకంగా ఉద్యోగమే వదిలేశాడు. కేవలం తల్లి కోరిన చిన్న కోరికను తీర్చేందుకు. ఇది నమ్మశక్యంగా లేదు కదూ. ఇది వాస్తవం కూడా. ఉన్నట్టుండి కృష్ణ కుమార్ ఒకే ఒక్క ట్వీట్ తో నేషనల్ హీరో అయి పోయాడు. ఏకంగా మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మనసును కదిలించింది అతడి జీవిత కథ.
కృష్ణ కుమార్ కు అందరి లాగే అమ్మ అంటే ప్రాణం. ఏనాడూ గడప దాటి బయటకు వెళ్లని తల్లిని దేశం మొత్తం తిప్పి చూపించాలని సంకల్పించాడు. మాతృసేవా సంకల్ప్ యాత్ర పేరుతో స్కూటర్‌పై సుమారు 18 రాష్ట్రాలు, మూడు దేశాలు తిప్పి చూపించాడు. తల్లి సాధారణ గృహిణి. తన 70 ఏళ్ల జీవితంలో ఏనాడు బయట ఊరికి వెళ్లింది లేదు. ఒకరోజు మాటల సందర్భంలో ఇదే విషయాన్ని దక్షాణ మూర్తికి చెప్పింది. కనీసం ఇంటికి దగ్గరలో ఉన్న బేలూరు హలిబేడును కూడా చూడ లేదని అనడంతో..ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. వెంటనే తను చేస్తున్న బ్యాంకు ఉద్యోగం వదిలేసి.. దేశ పర్యటనకు బయలుదేరారు. 20 ఏళ్ల క్రితం నాటి స్కూటర్‌ను ఎంచుకున్నారు. అది ఆయన తండ్రి కొన్న స్కూటర్. నాలుగేళ్ల క్రితం ఆయన మరణించారు. ఈ ప్రయాణంలో తమతో పాటు తన తండ్రి ఉంటారనే భావనతో స్కూటర్‌ను ఎంచుకున్నారు. మేం ముగ్గురు కలిసి ప్రయాణించినట్టే ఉంటుంది. ఆయన లేరనే ఆలోచన నాకు అస్సలు లేదు అంటూ ఉద్వేగానికి గురయ్యారు.
కేరళ నుంచి మొదలు పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపు అన్ని ప్రాంతాలు చుట్టేశారు. అలా 2018 జనవరి 18న ప్రారంభమైన వీరి ప్రయాణం..48,100 కిమీ.లు పూర్తి చేసింది. దేశంలోని ప్రాంతాలనే గాక, మయన్మార్, భూటాన్, నేపాల్‌కు కూడా వెళ్లొచ్చారు. దేవాలయాలు, సుప్రసిద్ధ ప్రాంతాలను ఆమెకు కృష్ణ కుమార్ చూపించారు. ఈ విషయాన్ని మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనిని ఆనంద్ మహీంద్ర చూశారు. ఇది అందమైన కథ. ఇందులో మాతృ ప్రేమ మాత్రమే కాదు.. దేశ భక్తి కూడా దాగుంది. షేర్ చేసినందుకు కృతజ్ఞతలు మనోజ్. అతన్ని నాకు పరిచయం చేస్తే కారు ఇస్తానంటూ ట్వీట్ చేశాడు. సో..ఒకే ఒక్క ట్వీట్ వైరల్ గా మారింది. కృష్ణమూర్తిని హీరో ను చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి