అదే ఊపు..అదే జోరు..డీకేనా మజాకా

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలుకు వెళ్లి, తిరిగి బెయిల్ పై విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అదే ఊపు..అదే జోరు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కన్నడ నాట డీకే పెద్ద దిక్కుగా ఉన్నారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రధాని మోడీ, అమిత్ షా లపై నిప్పులు చెరిగారు. వారిపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే కర్ణాటక లో అన్ని పార్టీల నేతలతో శివకుమార్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. సంకీర్ణ సర్కార్ కూలి పోయాక, ఈడీ, ఐటీ అధికారులు డీకేను టార్గెట్ చేశారు. ఆయనను మనీ లాండరింగ్ లో ఇరికించారు. తీహార్ జైలుకు తరలించారు. ఇదే సమయంలో మరో సీనియర్ లీడర్ చిదంబరం కూడా ఇదే జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు.

శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అంబికా సోనీతో కలిసి డీకేను కలిసి పరామర్శించారు. భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు శివకుమార్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి డీకే విడులయ్యారు. ఆయనకు కర్ణాటకలో భారీ ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్ మాట్లాడారు. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతఙ్ఞతలు తెలిపారు. జైలులో తనను కలిసి..ఆమె తనలో ధైర్యాన్ని నింపారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మనీ ల్యాండరింగ్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక కర్ణాటకలో అత్యంత సంపన్న నేతగా గుర్తింపు పొందిన శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ ల్యాండరింగ్‌ కేసులో సెప్టెంబరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివకుమార్‌తో పాటు ఆయన కూతురు ఐశ్వర్యను కూడా ఈడీ విచారించింది. కాగా తనను మోడీ, షా లు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు డీకే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!