జగన్ పై జేసీ సెటైర్స్
తన కామెంట్స్ తో అటు రాజకీయాలను ఇటు పొలిటికల్ లీడర్లకు హీటు తెప్పించే నాయకుడిగా జేసీ దివాకర్ రెడ్డికి పేరున్నది. ఆయనకు, తమ్ముడికి ప్రైవేట్ బస్సులున్నాయి. అవి రెండు రాష్ట్రాలలో జేసీ ట్రావెల్స్ పేరుతో తిరుగుతున్నాయి. ఇటీవల కొన్ని బస్సులను రవాణా శాఖాధికారులు సీజ్ చేశారు. ఇదే విషయంపై జేసీ సీరియస్ గా స్పందించారు. ఒక అడుగు ముందుకు వేసి జగన్ మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పరిపాలన జనరంజకంగా ఉందన్నారు. 100 మార్కులకు గాను తాను150 మార్కులు వేస్తున్నన్ని చెప్పారు. అయితే జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తమ అబ్బాయే అన్నారు. పరిపాలనలో కిందామీద పడుతున్నాడని వ్యాఖ్యానించారు.
ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా ఆయనకి తమ బస్సులే కనిపిస్తున్నాయని..ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేయడం తనకు అర్థం కాలేదన్నారు. ప్రభుత్వ చర్యలపై న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. గత 70 ఏళ్ల నుంచి వాహన రంగంలో ఉన్నామని.. చిన్న చిన్న లోటు పాట్లు ఊడడం సహజమేనని, ఆర్టీసీ తో సహా ఏ ట్రావెల్స్ కైనా ఇది మామూలేనని జేసీ స్పష్టం చేశారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని.. ఫైన్‌లతో పోయే తప్పిదాలకు సీజ్ చేయటం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకే.. తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. చూసే వారి కళ్లను బట్టి రాయలసీమ అభివృద్ధి ఉంటుందని.. ఎవరికి వాళ్లు తమ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకోవడంలో తప్పు లేదని జేసీ అభిప్రాయం పడ్డారు. కాగా చంద్రబాబు నాయుడు సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని.. ఎన్ని వర్షాలు పడినా ప్రాజెక్టులు లేకపోతే ఫలితం శూన్యమని జేసీ వ్యాఖ్యానించారు. మొత్తం మీద జేసీ కామెంట్స్ ఇప్పుడు ఏపీలో వైరల్ అయ్యాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి