బజాజ్ కు భారీ లాభం

ఆటోమొబైల్ సెక్టార్ లో బజాజ్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంటోంది. ద్విచక్ర వాహనాలతో పాటు బజాజ్ ఆటు అమ్మకాల్లో ఇదే కంపెనీ టాప్ గా ఉంటూ వస్తోంది. ఓ వైపు ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ పడుతున్నా బజాజ్ అమ్మకాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పైపెచ్చు అత్యధికంగా వాహనాలు అమ్ముడు పోయాయి. దీంతో మిగతా కంపెనీలను దాటుకుని బజాజ్ ఆదాయం పరంగా నంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. తాజాగా బజాజ్‌ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 1,523 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం 1,257 కోట్లుతో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ ఆటో తెలిపింది.

కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం కారణంగా 182 కోట్ల పన్ను ఆదా కావడం కూడా కలసి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం 8,036 కోట్ల నుంచి 4 శాతం తగ్గి  7,707 కోట్లకు చేరిందని పేర్కొంది. పన్నులు, డివిడెండ్లు కలిసి మొత్తం 2,072 కోట్ల చెల్లింపులు పోను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి నగదు, దానికి సమానమైన నిల్వలు 15,986 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. అయితే గత క్యూ2లో 13.4 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ2లో 11.73 లక్షలకు తగ్గాయని బజాజ్‌ ఆటో పేర్కొంది.

మోటార్‌ బైక్‌ల విక్రయాలు 11.26 లక్షల నుంచి 12 శాతం తగ్గి 9.84 లక్షలకు తగ్గాయని తెలిపింది. వాణిజ్య వాహన విక్రయాలు 2.12 లక్షల నుంచి 11 శాతం క్షీణించి 1.89 లక్షలకు తగ్గాయని వివరించింది. బైక్‌లకు సంబంధించి దేశీయ అమ్మకాలు 25 శాతం తగ్గాయని తెలిపింది. బైక్‌ల ఎగుమతులు మాత్రం 4.33 లక్షల నుంచి 7 శాతం పెరిగి 4.62 లక్షలకు చేరాయని పేర్కొంది. దీని వల్లనే బజాజ్ కంపెనీ ప్రాఫిట్ పరంగా గత్తెకిక్కిందని అనుకోవాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!