బిసిసిఐ చీఫ్ గా దాదా
భారత జట్టు మాజీ సారథి సౌరబ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చీఫ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. తాను ధరించిన బ్లేజర్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ బ్లేజర్‌ను నాకు టీం ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన ఈ బ్లేజర్‌ను ఇప్పుడు ధరించాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇది చాలా వదులైంది అంటూ వ్యాఖ్యానించారు. కాగా..బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడాన్ని గౌరవంగా భావిస్తానన్నారు. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉందన్న గంగూలీ.. విరాట్ కోహ్లీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
భారత క్రికెట్ అభివృద్ధికి తాను కష్టపడతానని గంగూలీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుతూ అతనో అద్భుతమైన ఆటగాడిగా అభివర్ణించారు. భారత క్రికెట్ చరిత్రలో ధోనీది ప్రత్యేక స్థానమన్నారు. ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నా, ఇంకా బీసీసీఐలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు మార్పులు చేయాలంటే కుదరదు. ఇందు కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని మీకు తెలుసు. దీనిని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను.
నాపై క్రికెటర్లు, కోట్లాది మంది అభిమానులతో పాటు క్రికెట్ బాగుండాలని అనుకునే వారంతా ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఇది ఒక రకంగా నాపై తీవ్ర వత్తిడి ఉందని చెప్పుకొచ్చారు గంగూలీ. మరో వైపు హర్భజన్ సింగ్, వీవీఎస్, సచిన్ టెండూల్కర్ , తదితరులు ఇప్పటికే గంగూలీని ప్రసంశలతో ముంచెత్తారు. దాదా కొలువు తీరడంతో అటు బెంగాల్ లో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆటలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా దాదా దుందుడుకుగా వ్యవహరిస్తారు. ఇదే ఇప్పుడు బిసిసిఐకి కావాల్సిన అవసరం ఉన్నది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి