ఎట్టకేలకు గణేష్ అరెస్ట్
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, పవన్ కళ్యాణ్ ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్, తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ బాధ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. ఓ వ్యాపారి వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వక పోవడంతో పాటు ప్రముఖ నిర్మాత వర ప్రసాద్ కు సంబంధించి చెక్ బౌన్స్ కేసు బండ్ల గణేష్ పై ఉన్నది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన గణేష్ పాలమూరు జిల్లా షాద్ నగర్ లో వ్యాపారం, ఇల్లు ఉంది. మెలమెల్లగా నటుడిగా స్టార్ట్ అయి, అనుకోకుండా ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు. ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు బండ్ల గణేష్ బినామీ గా ఉన్నాడనే ఆరోపణలు అప్పట్లో చాలా వచ్చాయి.
స్వతహాగా మాటకారి అయిన ఈ నటుడు కొంత మంది తో గ్యాంగ్ మెంటైన్ చేస్తాడనే విమర్శలున్నాయి. సినీ ఇండస్ట్రీలో తనను కాదనుకున్న వారిని బెదిరిస్తాడనే ఆరోపణలున్నాయి. తాజాగా పోలీసుల కళ్లు గప్పి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను ఎన్‌బీడబ్ల్యూ కింద బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ చెక్ బౌన్స్ కేసులో కడప ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెన్సెస్ న్యాయమూర్తి గత నెల 18న గణేష్‌కు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. ఫిలింనగర్‌లో నివసించే గణేష్‌కు వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు ప్రయతి్నస్తుండగా తప్పించుకు తిరుగుతున్నాడు.
నోటీసుకు సమాధానం చెప్పేందుకు పోలీస్ స్టేషన్‌కు రాగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కడప కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్ 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి